ప్రతిష్టాత్మక క్వీన్స్ కామన్ వెల్త్ వ్యాసరచన పోటీ విజేతగా లక్ష్మీమనోజ్ఞ

Featured Image

రాయల్ కామన్వెల్త్ సొసైటీ (RCS) పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే పురాతన ప్రముఖమైన రచనల పోటీ ది క్వీన్స్ కామన్వెల్త్ ఎస్సే కాంపిటీషన్ (QCEC) 2025 రన్నరప్‌గా ప్రవాస తెలుగు విద్యార్థిని ఆచంట లక్ష్మి మనోజ్ఞ గెలుపొందారు. సింగపూర్లోని క్రెసెంట్ గర్ల్స్ పాఠశాలలో సెకండరీ-2 విద్యార్థిని అయిన మనోజ్ఞ ఇండియా టు మారిషస్ అనే కవిత రచించి ఈ బహుమతి గెలుచుకుంది. తల్లి నుండి వేరు చేయబడి భారతదేశంలోని తన ఇంటి నుండి మారిషస్‌లోని ఒక ఎన్‌క్లోజర్‌కు తరలించబడిన ఒక చిన్న కోతి కథను ఈ కవిత చెబుతుంది. భారతదేశం నుండి మారిషస్‌కు దాని దయనీయ ప్రయాణాన్ని వర్ణిస్తూ, తల్లిచెంత స్వంత భూమిలో లభించే ఆత్మీయ వాతావరణం హఠాత్తుగా కోల్పోయి, పరాయి చోట బందీయై బాధలు పడుతూ తిరిగి తల్లి ప్రేమను ఆశిస్తూ అది పడే తపన దాని ఆర్ద్రమైన కోరికను అద్భుతంగా వర్ణించి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. తల్లిదండ్రులు శ్రీనివాస్, ప్రసన్న, సోదరి శ్రీమేఘనల సమక్షంలో మనోజ్ఞ ఈ అవార్డును క్వీన్ కెమిల్లా నుండి ఈ అవార్డు అందుకుంది.

Tags-Telugu Student Achanta Lakshmi Manojna Wins QECC 2025 Award From HM Queen Camille

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles