ప్రపంచంతో పోటీ పడే తెలంగాణను కలిసి నిర్మిద్దాం-జపాన్‌లో రేవంత్

Featured Image

జపాన్ తెలుగు సమాఖ్య నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాల్లో మంచి పురోగతి సాధించిందని చెప్పారు. త్వరలో తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

హైదరాబాద్ మూసీ నది ప్రక్షాళన అవసరమని, ఇందుకు కొంతమంది అడ్డుపడుతున్నా ప్రభుత్వం వెనక్కి తగ్గదన్నారు. టోక్యో రివర్‌ఫ్రంట్‌ అభివృద్ధిని పరిశీలించామని, అలాంటి ప్రాజెక్టులు తెలంగాణలో అమలు చేస్తామని వెల్లడించారు.

కాలుష్యం సమస్యను గుర్తించి ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో కాలుష్యంతో విద్యాసంస్థలు మూతపడుతున్నాయని గుర్తుచేశారు.

మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు వంటి ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధికి కీలకమని చెప్పారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగ అవకాశాల పెంపుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ప్రవాసులు సైతం రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములై ముందుకురావాలని సీఎం పిలుపునిచ్చారు. "ప్రతి ఒక్కరూ చేయగలిగినంత చేయాలి. ప్రపంచంతో పోటీ పడే తెలంగాణను కలిసి నిర్మిద్దాం," అని సూచించారు.

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles