సందడిగా సాగిన టాంటెక్స్ సంక్రాంతి
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (TANTEX) 2026 సంక్రాంతిని సాంస్కృతిక మహోత్సవంగా వేడుకగా నిర్వహించారు. అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి అతిథులకు శుభాకాంక్షలు తెలిపారు. 2025 సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్త శాంతి నూతి స్వాగత ప్రసంగం చేసి 2026 సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన అనిత వేమిరెడ్డిని పరిచయం చేశారు. మైత్రేయి-మన్విత వ్యాఖ్యానం చేశారు.
మంజులత మందపాకల మార్గదర్శకత్వంలో ముఫిన్ అకాడమీ విద్యార్థులు అమెరికా-భారత్‌ల జాతీయ గీతాలను ఆలపించారు. స్థానిక ప్రవాస బాలబాలికలు మహాగణపతిమ్, అష్టలక్ష్మి, జతిస్వరమ్, బ్రహ్మాంజలి, గోవింద గోవింద, బ్రహ్మమొక్కటే వంటి శాస్త్రీయ భక్తి నృత్యప్రదర్శనలతో అలరించారు. గురువులను సత్కరించారు. అనంతరం సినీ, జానపద నృత్యాలు ఆకట్టుకున్నాయి. మనబడి విద్యార్థులు అలవైకుంఠపురంలో, రైతు గొప్పతనం నాటికల ద్వారా సాంస్కృతిక, సామాజిక సందేశాలను అందించారు. ధున్కి అకపెల్లా బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
2025 టాంటెక్స్ కార్యవర్గాన్ని సత్కరించారు. మాజీ అధ్యక్షుడు చంద్రశేఖర్రెడ్డి పొట్టిపాటి, ట్రస్ట్ బోర్డు మాజీ ఛైర్ కొండ తిరుమలరెడ్డి ప్రసంగిస్తూ ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, ట్రస్టు బోర్డు అధ్యక్షుడు దయాకర్ మాడాలు తమ భవిష్యత్ కార్యాచరణను సభికులతో పంచుకున్నారు. ATA, NATS, TTA, NATA, IANT, TPAD, DARA, GRADA, D-TABS, GTA సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రంగోలి, వంటల పోటీల విజేతలను సన్మానించారు. స్నిగ్ధ ఎలేశ్వరపు, శైలేష్ ఎరుకుల్ల ప్రదర్శనతో వేడుకలు ముగిశాయి. కార్యక్రమ సమన్వయకర్త కమలాకర్ వందన సమర్పణ చేశారు.
Tags-2026 TANTEX Sankranti Celebrated In Telugu Spirit
Gallery






Latest Articles
- Siddhipeta Nri Uday Nagaraju Takes Oath In Uk House Of Lords From Bloomsbery
- Sreekanth Akkapalli Takes Charge As Fia President
- Charlotte Nats Conducts 2026 Chess Tournament
- 2026 Ata 19Th Conference Kick Off In Virginia
- Tana New York Conducts Cpr Training Session
- Telugu Samithi Of Nebraska Sankranti 2026
- Tantex 2026 Sankranti In Frisco
- Myta Malaysia Performs For Indian Pm Modi
- Tagkc Kansas City Telugus Celebrate 2026 Sankranthi
- Apts Helps Build Andhras First Co Working Space And Digital Library In Kuppam
- Siliconandhra Silver Jubilee On August 8Th 2026
- Bavaria Indians Celebrate Festival Of Togetherness 2026
- Gta Announces 2026 27 Ec And Bot
- Tagb Boston 2025 26 Transfers Power To New Ec
- Ata Pennsylvania Delaware Teams Meet To Discuss Ata 2026 Conference Arrangement
- Mega Kamma Mahanadu In Tamil Nadu By Kgf On February 8Th
- Chetana Foundation Charity Events In Kalwakurthy
- Doha Music Lovers Singing And Dance Competition Across India
- Nats Announces 2026 27 Bod Members
- Achievements Of Padmabhushan Dr Nori Dattatreyudu