శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డితో శంకర నేత్రాలయ USA సమావేశం

Featured Image

శంకర నేత్రాలయ USA 1988 జూన్‌లో రాక్‌విల్, మేరీల్యాండ్ లో స్థాపించారు. అమెరికాలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నిధులను సేకరించి భారతదేశంలోని శంకర నేత్రాలయ (చెన్నై)సంస్థ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తారు. శాంతా బయోటెక్ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డి శంకర నేత్రాలయ అట్లాంటాలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరప్రసాద్ రెడ్డి ₹25లక్షల విరాళాన్ని ప్రకటించారు. దీనితో ఆయన ఇప్పటివరకు ₹50లక్షలను శంకర నేత్రాలయకు అందజేశారని నిర్వాహకులు తెలిపారు.

డల్లాస్‌లో బేడపూడి ప్రకాశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మరో కార్యక్రమంలో వరప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ప్రకాష్ $50వేల డాలర్లను విరాళంగా ప్రకటించారు. డల్లాస్ కార్యక్రమంలో మొత్తం లక్ష డాలర్లు సమకూరినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రెండు కార్యక్రమాల్లో కార్యదర్శి మూర్తి రేకపల్లి,  పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్‌ రసమల్లు, రాజేష్ తడికమల్ల, శంకర నేత్రాలయ USA పాలకమండలి సభ్యుడు డా. యు. నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Santha Biotech Varaprasad Reddy Meets Sankara Netralaya USA Team

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles