హ్యూస్టన్‌లో ఆటా మదర్స్ డే వేడుకలు

Featured Image

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) ఆధ్వర్యంలో టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్‌లో ఆదివారం నాడు మదర్స్ డే వేడుకలు నిర్వహించారు. స్థానిక అష్టలక్ష్మి ఆలయంలో నిర్వహించిన ఈ వేడుకల్లో స్థానిక ప్రవాసులు పాల్గొన్నారు. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్ల, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నర్సిరెడ్డి గడ్డికొప్పులా, జాయింట్ సెక్రటరీ శారద సింగిరెడ్డి, అతిధులుగా జడ్జి ట్రిసియా క్రేనేక్, జడ్జి ఎడ్వర్డ్ ఎం. క్రేనేక్, డా. కల్పలత గుంటుపల్లి, డా. రేణు తమిరిస, డా. రత్న కుమార్, ఆశ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. బోర్డు అఫ్ ట్రస్టీ శ్రీధర్ కంచనకుంట్ల, రామ్ మట్టపల్లి కార్యక్రమం పర్యవేక్షించారు, జె.పి. ముదిరెడ్డి, జగపతి వీరతి, దయాకర్ ధవళాపూర్, వెంకట్ రమణ రెడ్డి ఎరువు, వెంకట్ గార్లపాటి, బంగారు రెడ్డి ఆలూరి తదితరులు సహకరించారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-ATA 2025 Mothers Day In Houston

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles