తితిదే ఆధ్వర్యంలో...అన్నమయ్యకు సింగపూర్ స్వరలయ అకాడమీ నీరాజనం

Featured Image

తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న అన్నమయ్య సంకీర్తనల ప్రచార కార్యక్రమంలో స్వరలయ ఆర్ట్స్(సింగపూర్) సంస్థ సభ్యులు పాల్గొన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ ఆశీస్సులతో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) వ్యవస్థాపక అధ్యక్షురాలు శేషుకుమారి వారి శిష్యుల బృందం అన్నమయ్యకు కీర్తనలతో స్వరార్చన చేశారు.

మేడసాని మోహన్ మాట్లాడుతూ అన్నమయ్య కళామందిరం నిర్వహించిన మొదటి ప్రవాసాంధ్రుల సంగీత కార్యక్రమం ఇదేనని అభినందించారు. సింగపూర్ వాస్తవ్యులు బి.వి.ఆర్.చౌదరి-రాజ్యలక్ష్మిలు ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా అన్నమయ్య పన్నెండవ తరం వంశస్థులు తాళ్ళపాక హరినారాయణాచార్యులు పాల్గొన్నారు.

2019లో స్వరలయ సంస్థను స్థాపించి సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయంతో అనుబంధంగా సింగపూర్‌లో సంగీత-నాట్య శాస్త్రాల్లో శేషుకుమారి శిక్షణిస్తున్నారు. అమెరికా, హాంకాంగ్, ఆస్ట్రేలియా, ఇండియా, మలేషియా నుండి అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు.

Tags-Singapore Swaralaya Arts Academy Participates In Annamacharya Project

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles