లోకేష్‌కు తెదేపా పగ్గాలు ఇవ్వాలి-డీసీ మహనాడులో తీర్మానం

Featured Image

అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్ డీసీలోని వర్జీనియాలో "మినీ మహానాడు"ను ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భానుప్రకాశ్ మాగులూరి సమన్వయకర్తగా వ్యవహరించారు. విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కు పార్టీ బాధ్యతలు పూర్తిస్థాయిలో అప్పగించాలని ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని అటు పార్టీపై, ఇటు ప్రభుత్వంపై పూర్తి పట్టు సాధించారని అన్నారు. ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. రాజా రావులపల్లి, కిషొర్ కంచెర్ల, రమేష్ అవిరినేని, చక్రవర్తి, సీతారామారావు, రఘు, హనుమంతరావు, డాక్టర్ కేవి రావు, విజయ భాస్కర్, రామకృష్ణ రెడ్డి, చంద్రనాథ్, రమేష్, లోకేంద్ర ప్రసాద్, యాదగిరి, చిట్టెల సుబ్బారావు, సత్తిబాబు, సుబ్రహ్మణ్యం, మాల్యాద్రి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Washington DC NRI TDP Mini Mahanadu 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles