డబ్లిన్‌లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జన్మదినోత్సవం

Featured Image

డబ్లిన్ నగరంలోని VHCCI ఆలయంలో శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివకుమార్, మాధవి దంపతుల సహకారంతో అభిషేకం జరిపారు. విద్యానాథ్–రజిత, కళ్యాణ్–ఇనిస్ దంపతులు పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ సేవలు నిర్వహించారు. శీతల్ కుమార్, వర్షిణి దంపతుల సహకారంతో పల్లకీసేవ చేపట్టారు. పవన్ కుమార్ ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహించారు. చిన్నారులకు కుమారి పూజను శ్రీనివాస్, సరిత, సంతోష్–విన్య దంపతులు నిర్వహించి బహుమతులు అందించారు. సామూహిక కుంకుమార్చన జరిగింది. జ్ఞాన ప్రకాష్–మహాలక్ష్మి దంపతులకు పినాక శర్మ ఆశీర్వచనాలందించారు. శిరీష, కవిత, రేణుక ఆధ్వర్యంలో పారాయణ కార్యక్రమం నిర్వహించారు.

ఆణివార సేవ అనంతరం ప్ర‌సాద విత‌ర‌ణ, భోజనం ఏర్పాటు చేశారు. వ్యాఖ్యాతలుగా లక్ష్మి హాసిని, మౌనిక వ్యవహరించారు. చిన్నపిల్లలు అన్నమాచార్య కీర్తనలు, నృత్యాలు ప్రదర్శించారు. శ్రీకిరణ్, నీరజ, శ్రీనివాస్–సుధా, ఝాన్సీ, శిరీష, రఘు, కవిత, వెంకట్ జూలూరి, ప్రవీణ్, నరేంద్ర కుమార్, సంతోష్, శ్రీనివాస్ వెచ్చ, భార్గవ్, మాణిక్, కళ్యాణ్, రేణుక, మన్మోహన్, శివ, హేమంత్, జయరాం, తృప్తి, కావ్య, సాగర్, మాధురి తదితరులు పాల్గొని సహకరించారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Dublin Ireland Vasavi Kanyaka Parameswari Birthday Celebrations 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles