జర్మనీలో జై తెదేపా - ఘనంగా మినీ మహానాడు

Featured Image

ఎన్టీఆర్ 102వ జయంతిని పురస్కరించుకుని జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ టీడీపీ ఆధ్వర్యంలో మినీ మహానాడు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శాసనసభ్యురాలు గౌతు శిరీష, గుంటూరు మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు నివాళులు అర్పించి వేడుకలను ప్రారంభించారు.

శిరీష మాట్లాడుతూ.. నేడు దేశంలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నింటికీ ఎన్టీఆరే ఆద్యుడని అన్నారు. కిలో రూ.2కే బియ్యం, పేదలకు పక్కా గృహాలు, జనతావస్త్రాల లాంటి అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ.. ఫ్రాంక్ ఫర్ట్ మినీ మహానాడుకు ఇంత భారీ స్థాయిలో స్పందన రావడం హర్షణీయం అన్నారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తీర్మానించారు. పహల్గాం ఉగ్రదాడి మృతులకు సంతాపం తెలిపారు. సుమంత్ కొర్రపాటి, టిట్లు మద్దిపట్ల, శ్రీకాంత్ కుడితిపూడి, శివ బత్తుల, పవన్ కుర్రా, నరేష్ కోనేరు, వెంకట్ కాండ్ర, వంశీ దాసరి, శివశంకర్ లింగం తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Mini Mahanadu 2025 In Germany Frankfurt Mannava Subbarao Goutu Sireesha

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles