జర్మనీలో వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం

Featured Image

తిరుమల తిరుపతి దేవస్థానం,ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ సహకారంతో, శ్రీ బాలాజీ వేదిక్ సెంటర్ జర్మని ఇ.వి ఆధ్వర్యంలో శ్రీవారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. టిటిడి డిప్యూటీ.ఇ.ఇ. మల్లయ్య పర్యవేక్షణలో టిటిడి వేద పండితుల బృందం శాస్త్రోక్తంగా కృతువును నిర్వహించింది. వేద మంత్రోచ్ఛారణలు, సాంప్రదాయ సంగీతం, మంగళ వాయిద్యాలు, పుష్ప అలంకరణలతో వేదిక ఆధ్యాత్మిక వాతావరణంతో భాసిల్లింది.

భారత కాన్సులేట్ జనరల్ శుచితా కిషొర్, స్థానిక నగర మేయర్ హెల్మ్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు టిటిడి లడ్డు ప్రసాదంతో పాటు కళ్యాణ ప్రసాదం పంపిణీ చేశారు.

ఫ్రాంక్‌ఫర్ట్‌లో కృష్ణ జవ్వాజి, సూర్య ప్రకాష్ వెలగా, సుబ్బారావు కొర్లెపర, పూర్ణ కొర్లెపర, దిలిప్ కుమార్, ప్రసాద్ నందమూరి, భారతి, మ్యూనిచ్, హాంబర్గ్ నగరాల్లో టిట్టు మద్దిపట్ల, డా.శివశంకర్ లింగం, యూరప్ & యు.కె కోఆర్డినేటర్ డాక్టర్ కిషోర్ బాబు చలసాని, డాక్టర్ శ్రీకాంత్, సుమంత్ కొర్రపాటి తదితరులు ఈ ఉత్సవాన్ని సమన్వయపరిచారు.

Tags-TTD Kalyanam In Germany 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles