మలేషియాలో భారాస ఆవిర్భావ దినోత్సవం

Featured Image

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు మలేషియా బి ఆర్ యస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పదకొండవ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మలేషియా భారతీయ రాష్ట్ర సమితి నాయకత్వంలో ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి. మలేషియా ఎన్నారై శాఖ అధ్యక్షుడు మారుతి కుర్మ మాట్లాడుతూ, "నీళ్లు, నిధులు, నియామకాలు" నినాదంతో ప్రారంభమైన మలిదశ ఉద్యమం ద్వారా సాధించిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని గుర్తు చేశారు. రాష్ట్ర సాధనలో అమరుల త్యాగాలను స్మరిస్తూ వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులు తమ ఆటపాటలతో ఆహ్లాదంగా అలరించారు. కార్యక్రమంలో బారాస మలేషియా ఫౌండర్ చిరుత చిట్టిబాబు, ఉపాధ్యక్షుడు మునిగల అరుణ్, కార్యదర్శి, కోర్ కమిటీ సభ్యులు సందీప్ కుమార్ లగిశెట్టి, బొడ్డు తిరుపతి, గద్దె జీవన్ కుమార్, రమేష్ గౌరు, సత్యనారాయణరావ్ నడిపెల్లి, హరీష్ గుడిపాటి, ఇతర సభ్యులు శ్యామ్, పూర్ణ చందర్ రావు, కిషోర్, క్రాంతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-BRS Formation Day Malaysia 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles