ఎన్‌టీఅర్-కేసీఆర్ మాత్రమే చేశారు..ఫ్రిస్కోలో ఎర్రబెల్లి

Featured Image

ఒక విజన్‌తో తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేసిన నాయకులు ఇద్దరేనని...అందులో ఒకరు ఎన్.టి.రామారావు, మరొకరు కేసీఆర్ అని భారాస మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కోలో బుధవారం నాడు రిచ్‌వుడ్స్‌లో ఆయనతో ఆత్మీయ సమావేశాన్ని, డల్లాస్‌లో భారాస రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ప్రసంగిస్తూ పేదల కోసం, గ్రామాల కోసం, రైతుల కోసం విప్లవాత్మక మార్పులు, అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్‌టీఆర్-కేసీఆర్‌లకు మాత్రమే దక్కుతుందని అన్నారు. తెలంగాణలోని బావులు, చెరువులు, కాలువలకు నీరు తీసుకొచ్చిన విజనరీ కేసీఆర్ అని ఆయన కొనియాడారు.

భారాస అమెరికా సమన్వయకర్త తన్నీరు మహేష్ మాట్లాడుతూ ఆదివారం నాడు అలెన్‌లోని కొమెరికా సెంటరులో భారాస రజతోత్సవం, తెలంగాణా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని..ప్రవాసులు భారీ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవల్సిందిగా కోరారు. సమావేశంలో ఎల్.బి.నగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, వంశీ రెడ్డి కుంచరకుంట్ల కూడా పాల్గొన్నారు.

బుధవారం ఉదయం ఎర్రబెల్లికి డల్లాస్ విమానాశ్రయంలో ప్రవాస భారాస శ్రేణులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి అర్వింగ్‌లోని మహాత్మ గాంధీ స్మారకస్థలిని సందర్శించి నివాళి అర్పించారు.

* డల్లాస్ చేరుకున్న భారాస నేతలు

జూన్ 1వ తేదీన డల్లాస్‌లో జరిగే భారాస రజతోత్సవంలో పాల్గొనే నిమిత్తం కొప్పుల ఈస్వర్, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, తాతా మధు, గండ్ర జ్యోతి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎల్.రమణ, బాల్క సుమన్, బాలమల్లు, గ్యాదరి కిషోర్, గువ్వల బాలరాజు, క్రాంతికిరణ్, నోముల భగత్, కోరుకంటి చందర్, కోలేటి దామోదర్, కర్నె ప్రభాకర్, పైలట్ రోహిత్ రెడ్డి, అభిలాష్ రంగినేని, రఘువీర్ సింగ్, యుగందర్ గుజ్జా, పుట్టా విష్ణువర్ధన్ రెడ్డిలు ఇప్పటికే డల్లాస్ చేరుకోగా పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, కల్వకుంట్ల సంజయ్, రసమయి బాలకిషన్, కేటీఆర్ తదితరులు శుక్ర-శనివారాల్లో చేరుకోనున్నారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-Only NTR and KCR Did That Says Errabelli In Frisco Richwoods

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles