తానా మహాసభల టికెట్లపై బంపర్ ఆఫర్

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 24వ మహాసభలు డెట్రాయిట్‌లో జులై 3,4,5 తేదీల్లో నిర్వహిస్తున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో సందడి చేయనున్నారు. సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, నిఖిల్, యాంకర్ సుమ, దర్శకులు అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, థమన్, గాయకులు చిత్ర, సునీత, ఎస్.పి.బి. చరణ్, శ్రీకృష్ణ, సింహ, శోభారాజు, సత్యశ్రీ తదితరులు ఈ వేడుకలకు వస్తున్నారు.

జూన్ 8వ తేదీలోగా 2025 తానా సభలకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక టికెట్‌పై మరో టికెట్ ఫ్రీగా ఇస్తున్నట్లు తానా మహాసభల కోఆర్డినేటర్ ఉదయ్‌కుమార్ చాపలమడుగు తెలిపారు. కాన్ఫరెన్స్ వెబ్ సైట్ tanaconference.org ద్వారా ఈ ఆఫర్ పొందవచ్చు.

Tags-TANA 2025 Conference Tickets On BOGO Offer

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles