కాన్సాస్ సిటీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Featured Image

తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు స్థానిక హిందూ టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బతుకమ్మల వద్ద ఆటపాటలతో మహిళలు వీనులవిందుగా సందడి చేశారు. సాహిత్య వింజమూరి వ్యాఖ్యానం ఆకట్టుకుంది. చిన్నపిల్లలు కోలాటంతో అలరించారు.

అందమైన బతుకమ్మలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. నిర్వాహకులు తెలుగు విందుని ఏర్పాటు చేశారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన కార్యవర్గ సభ్యులకి, స్వచ్ఛంద సేవకులకు, దాతలకు సంఘం అధ్యక్షురాలు శ్రావణి మేక, ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీనివాస్ పెనుగొండ ధన్యవాదాలు తెలిపారు.

Tags-TAGKC Kansas City Batukamma

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles