ప్రభుత్వ పాఠశాలకు నాట్స్ భారీ సాయం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) ఏలూరు సమీపంలోని వట్లూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అసెంబ్లీ, డైనింగ్ హాల్ నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. 400 మంది విద్యార్ధులు చదువుకునే ఈ పాఠశాలలో విద్యార్ధుల కోసం నాట్స్ ఈ నిర్మాణాలను చేపట్టిందని అధ్యక్షుడు మందాడి శ్రీహరి, మాజీ అధ్యక్షుడు మదన్ పాములపాటిలు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, రాధాకుమారి ధూళిపాళ్లలు ఈ నూతన భవనాలను ప్రారంభించారు. నాట్స్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ భాను ప్రకాశ్ ధూళిపాళ్ల రూ.2లక్షలు, నాట్స్ ద్వారా డాక్టర్ నాగుబడి సుబ్బారావు మరో ₹2లక్షలను ఈ నిర్మాణానికి ఆర్థిక సహకారంగా అందజేశారు. ఈ పాఠశాలో కంప్యూటర్ శిక్షణ కేంద్రాన్ని కూడా నాట్స్ ద్వారా ప్రారంభించారు. కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి సిబ్బందికి జీతాన్ని కూడా భానుప్రకాశ్ ధూళిపాళ్ల ఏర్పాటు చేయడం పట్ల వట్లూరు గ్రామ ప్రజలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

భానుప్రకాశ్ ధూళిపాళ్లను స్ఫూర్తిగా తీసుకుని ప్రవాసాంధ్రులు తమ ఊరి బాగుకోసం ముందుకు రావాలని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పిలుపునిచ్చారు. నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, ప్రతినిధులు రాజేశ్ కాండ్రు, సుధీర్ మిక్కిలినేని, మురళీకృష్ణ మేడిచెర్ల, కిరణ్ మందాడి, రవి కిరణ్ తుమ్మల, రవి తాండ్ర, కిషోర్ నారే తదితరులు సమాజహిత కార్యక్రమాలు నిర్వహించినందుకు భానుప్రకష్‌ను అభినందించారు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-NATS Helps Govt School In Eluru District Vatluru

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles