అట్లాంటాలో సందడిగా కమ్మ వారి 2025 ఆత్మీయ సమ్మేళనం

Featured Image

ఉత్తర అమెరికా కమ్మ సంఘం(NAKS) ఆధ్వర్యంలో “కమ్మ వారి ఆత్మీయ సమ్మేళనం 2025” అట్లాంటాలోని డీసానా మిడిల్ స్కూల్ ప్రాంగణంలో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. అమెరికా నలుమూలల నుండి అంతటినుంచి వేలాది కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భక్తి, సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు, సాంకేతిక ప్రదర్శనలు, వినోదంతో ఈ సమ్మేళనం సందడిగా సాగింది. కమ్మ వారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ఈ ప్రయత్నం విజయవంతం అయిందని నిర్వాహకులు తెలిపారు.

శుక్రవారం నాడు బ్యాంకెట్ విందు ఏర్పాటు చేశారు. నాక్స్ సేవా కార్యక్రమాలను వీడియో ద్వారా ప్రదర్శించారు. సేవకులకు, దాతలకు సన్మానం చేశారు. సాంస్కృతిక ప్రదర్శనలతో డిన్నర్ నైట్‌ అలరించింది.

శనివారం నాడు శ్రీవారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం ఆంధ్ర విందు భోజనం, యోగా సెషన్, వధూవర పరిచయ సమావేశం, బాలల సాంకేతిక పోటీలు, స్టార్టప్ నెట్‌వర్కింగ్, సంగీత విభావరితో వేడుకలు ఆకట్టుకున్నాయి. రాత్రి లైవ్ బ్యాండ్ ప్రదర్శన, గ్రాండ్ డిన్నర్‌తో ఈ వేడుకలు ముగిసాయి. వేడుకల నిర్వహణకు సహకరించిన వారికి నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.

NAKS – సేవలోనే సమృద్ధి, సంస్కృతిలోనే ఐక్యత!

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-NAKS 2025 Kamma Meet In Atlanta

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles