రేసింగ్ రాజధాని IMS సందర్శించిన సంపూర్ణానందగిరి స్వామీజీ

Featured Image

శ్రీ జగద్గురు మఠం శ్రీ లలితాంబికా సుపీఠం పీఠాధిపతి పరమపూజ్య సంపూర్ణానందగిరి స్వామీజీ శుక్రవారం నాడు అమెరికాలోని ప్రఖ్యాత ఇండియానాపోలిస్ మోటార్ స్పీడ్వే(IMS)ను సందర్శించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా రేసింగ్ రాజధాని(Racing Capital of the World)గా ప్రసిద్ధిగాంచింది. IMSలో గల సాంకేతికత, అభివృద్ధి, నిర్మాణ కుశలతను స్వామిజీ అభినందించారు. ఈ పర్యటనలో స్వామిజీతో పాటు ఇండియా బిజినెస్ కౌన్సిల్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు చింతల ఉన్నారు.

1909లో ఏర్పాటు చేయబడిన IMS ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, వినియోగంలో ఉన్న రేస్ ట్రాక్‌గా గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే Indy 500 ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది రేసింగ్ ప్రియులను ఆకర్షిస్తుంది.

Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org

Tags-Sampoornananda Giri Swamyji Visits IMS Indianapolis

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles