సమాజానికి తిరిగి ఇవ్వడమే నా ప్రాధాన్యత-నాట్స్ ఛైర్మన్ కిషోర్ కంచర్ల

Featured Image

సంపాదించడం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు...విజ్ఞానాన్ని, మన మనుషులను, వారి ప్రేమను సంపాదించడమని ఇది కేవలం సమాజానికి తిరిగి ఇవ్వడం ద్వారానే సాధ్యపడుతుందని ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) బోర్డు ఛైర్మన్ కంచర్ల కిషోర్ అన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన జీవనప్రస్థానంపై ప్రత్యేక కథనం.

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని గుడివాడ-పామర్రు సమీపంలోని రిమ్మనపూడి గ్రామంలో సినీ నిర్మాత-దర్శకులు పూర్ణచంద్రరావు-విజయలక్ష్మి దంపతులకు జన్మించిన కిషోర్...2000లో కేవలం 110 డాలర్లతో అమెరికాకు వచ్చిన కిషోర్ ఐటి రంగాన్నే పునాదిగా చేసుకుని అమెరికాలో బిర్యానీ సామ్రాజ్యాన్ని నిర్మించి వందల కోట్ల విలువైన వ్యాపారాలను సృష్టించారు.

2011లో హోటళ్ల రంగంలోకి అడుగిడిన ఆయన డాలస్‌లో బావర్చిని ప్రారంభించి దాన్ని శరవేగంగా విస్తరించారు. ఒక శాఖతో ఆగకుండా దానిని ఒక బ్రాండ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుని 2019కల్లా అమెరికా అంతటా 50కి పైగా బ్రాంచ్‌లను ఏర్పాటు చేసి లక్ష్యాన్ని చేరుకున్నారు. కేవలం రుచి, నాణ్యతతోనే తాను విజయాలు సాధించానని కిషోర్ వెల్లడించారు. అందుకే ఇప్పటికీ రెస్టారెంట్‌కు వెళ్లి కస్టమర్ల ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం తనకు అలవాటని తెలిపారు. భారతీయ రుచులను, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఘుమఘుమలను అమెరికన్లకు పరిచయం చేశారు.

2020లో ఆర్కాన్సా వెంచర్స్‌తో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అడుగుపెట్టారు. నేడు సుమారు $600 మిలియన్ల విలువైన ఆస్తులను నిర్వహించే స్థాయికి ఆర్కాన్సా వెంచర్స్ ఎదిగింది. మార్బుల్ మైనింగ్‌, పినాకిల్ సర్ఫేసెస్‌తో పాటు అట్లాంటా, డల్లాస్, అలబామాలలో మూడు ఐటి కంపెనీలను, ఆరోగ్య రంగ సేవలను విజయవంతంగా నిర్వహిస్తూ ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు.

కిషోర్ తండ్రి పూర్ణచంద్రరావు నిర్మాత-దర్శకుడు కావడంతో ఆయనకు సినీ రంగంతో మంచి అనుబంధం ఉంది. సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ, ఆయన తనయుడు మహేష్ బాబు కుటుంబాలతో, సంగీత దర్శకుడు ఇళయరాజాతో ప్రత్యేక అనుబంధం ఉంది. లండన్ సింఫనీ ఆర్కెస్ట్రా కోసం ఇళయరాజా స్వయంగా కిషోర్‌ని ఆహ్వానించడం వారి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం. కీరవాణి, మణిశర్మ, ఆర్.పి. పట్నాయక్, మనో, సినీ దర్శకులు కె. రాఘవేంద్రరావు, ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ తదితరులతో ఆయనకు మంచి స్నేహం ఉంది.

సంపాదించడమే కాదు తిరిగి సమాజానికి ఇవ్వడం కూడా ముఖ్యమని తాను నమ్ముతానని, అందుకే నాట్స్ ద్వారా సేవా కార్యక్రమాలను బలోపేతం చేయడమే గాక నాట్స్ శాఖలను కూడా విస్తరిస్తామని కిషోర్ తెలిపారు. 2008 నుండి నాట్స్‌లో పలు పదవులు నిర్వహించిన ఆయన 2013, 2019లలో డాలస్‌లో జరిగిన నాట్స్ సంబరాలకు మద్దతు అందించారు. 2019 నాట్స్ తెలుగ సంబరాల కమిటీకి చైర్మన్‌గా కూడా వ్యవహరించీ సంబరాలను అద్భుతంగా నిర్వహించారు. 2020లో కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు, ఆహార సామగ్రి వితరణ, సొంత గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించారు.

తన విజయం వెనుక తన సతీమణి బిందు, పిల్లలు గౌతమ్, హరిణి, జననిల తోడ్పాటు మరువలేనిదని కిషోర్ వెల్లడించారు.

Tags-Giving Back To Society Is My Priority Says NATS Chairman Kishore Kancharla

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles