
తానా ఆటా అంటూ అటుపోతే ఇక్కడ టాటా చెప్తారు - చంద్రబాబు చురకలు

తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి గైర్హాజరైన 15మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నియోజకవర్గాల్లో ప్రజలకు దూరంగా ఉండటం సరికాదని సమావేశం ముగింపు సందర్భంగా.. గట్టిగా హెచ్చరించారు.
తానా ఆటా అంటూ విదేశాల్లో తిరుగుతుంటే ప్రజలు ఇక్కడ టాటా చెప్తారని సున్నితంగా మందలించారు.
గైర్హాజరుకు కారణాలు అడిగితే కొందరు విదేశీ పర్యటనలు అన్నారు, ఇంకొంతమంది దైవ దర్శనాలు అని సమాధానం ఇచ్చారని నేతల గైర్హాజరుపై చంద్రబాబు చురకలు అంటించారు. పార్టీ కార్యక్రమాలకంటే ఇతరత్రా ఎక్కువయ్యాయా అని నిలదీశారు. దేవాలయ సందర్శనలు మరో రోజు పెట్టుకోవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. తరచూ విదేశీ పర్యటనలు పెట్టుకునేవారు ఇక ఫారిన్‌లోనే ఉండటం మంచిదని హితవు పలికారు. తానా, ఆటాలకు టిక్కెట్లు బుక్ చేసుకున్న వారి జాబితా కూడా తన వద్ద ఉందని నేతలతో సీఎం అన్నారు.
Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org
Tags-AP CM Chandrababu Warns MLAs Against Foreign Trips To TANA
bodyimages:

Latest Articles
- Ata 19Th Conference 2026 In Baltimore
- Ratesa 10Th Anniversary In Cochin Mandali Gummadi Attends
- Nandigama Mla Tangirala Sowmya In Washington Dc
- Naatu Band Infusion To Entertain In Nats Sambaralu
- Krishna Nri Meet At Tana 2025 Conference In Detroit
- Mahesh Bigala Offers Tribute To Pvnr In Australia
- Tni Special Interview With Nadella Gangadhar Tana Conference2025 Chairman
- Godavari Nris Meet And Greet At Tana 2025 Detroit
- Aurora Illinois Sri Venkateswara Swami Brahmotsavam 2025
- Tana Conference Throwball Volleyball Competitions 2025