సత్తెనపల్లిలో ఆశ్రమాలకు నాట్స్ చేయూత

Featured Image

తెలుగునాట నాట్స్ సేవా కార్యక్రమాలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని మొల్లమాంబ వృద్ధాశ్రమంలో అన్నదానం చేసి, గత ఎనిమిదేళ్లుగా వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులను నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరి ప్రశంసించారు. వృద్ధాశ్రమానికి నాట్స్ చేయూత అందిస్తుందని భరోసా ఇచ్చారు. కన్న తల్లిదండ్రులను విస్మరించకూడదని, పేద వృద్ధులకు మానవత్వంతో సాయం చేయడం అందరి బాధ్యత అని అన్నారు. అమెరికాలోనూ నాట్స్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ముఖ్యంగా పేదల ఆకలి బాధలు తీర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

ఇక, సత్తెనపల్లిలోని పరివర్తన ఆశ్రమ పాఠశాలలో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు నూతన వస్త్రాలు, ఆహారానికి కావాల్సిన బియ్యం, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులు అందించారు. భాషే రమ్యం – సేవే గమ్యం అనే నినాదంతో నాట్స్ ముందుకు సాగుతుందని, దివ్యాంగులకు మరియు పేద విద్యార్థులకు నిరంతర సహాయం అందిస్తుందని చెప్పారు.

Tags-NATS Helps Ashrams In Sattenapalli

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles