Breaking - తానా తదుపరి అధ్యక్షుడిగా ఎంపికైన లావు శ్రీనివాస్

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) తదుపరి అధ్యక్షుడిగా అట్లాంటాకు చెందిన కృష్ణా జిల్లా ప్రవాసాంధ్రుడు లావు శ్రీనివాస్ ఎంపికయ్యారు. తానా ఫౌండేషన్ నిధుల కుంభకోణం, FBI-IRS-DOJ వంటి దర్యాప్తు సంస్థల నిఘానీడలో సంస్థ క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా తానా రాజ్యాంగంలో మార్పులు చేసి...ఈ ఏడాది కార్యవర్గం మొత్తాన్ని సెలక్షన్ పద్ధతిలో ఏర్పాటు చేశారు. అధ్యక్ష పదవికి కొల్లా అశోక్‌బాబు, లావు శ్రీనివాస్‌లు నామినేషన్లు దాఖలు చేయగా కనకం బాబు నేతృత్వంలోని ఎన్నికల కమిటీ, తానా బోర్డు లావు శ్రీనివాస్ వైపు మొగ్గు చూపారు.

తానా 24వ సభలు జులై 3,4,5 తేదీల్లో డెట్రాయిట్‌లో జరగనున్నాయి. ఇందులో డా. కొడాలి నరేన్ అధ్యక్షుడిగా పదవి చేపడతారు. ఆయన 2027 వరకు కొనసాగుతారు. 2027-29 కాలానికి గాను లావు శ్రీనివాస్ అధ్యక్షుడిగా కొనసాగుతారు.

ఇదే సెలక్షన్ పద్ధతిలో కార్యదర్శిగా పంత్ర సునీల్, కోశాధికారిగా కసుకుర్తి రాజా, సహాయ కార్యదర్శిగా కొణిదెల లోకేష్, సహాయక కోశాధికారిగా యార్లగడ్డ రాజేష్‌లు ఎంపికయ్యారు. తానా కార్యక్రమాల నిర్వహణ సమన్వయకర్త పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాకపోవడం గమనించవల్సిన విషయం.

పూర్తి కార్యవర్గం దిగువ చూడవచ్చు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-TANA 2025 Election Results, Lavu Srinivas Selected As TANA 2027-29 President

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles