టీవీ సీరియల్స్ పాటలతో హుషారెత్తించిన టాంపా చిన్నారులు

Featured Image

8వ నాట్స్ సంబరాల చివరి రోజు ఆదివారం నాడు పాత టీవీ సీరియల్స్ టైటిల్ సాంగ్స్ ఆలపించి స్థానిక ప్రవాస చిన్నారులు హుషారెక్కించారు. పిన్ని, మెట్టెల్సవ్వడి, లేడి డిటెక్టివ్, అమృతంతో పాటు ప్రఖ్యాత వాణిజ్య ప్రకటనలు లైఫ్‌బాయ్, జండూ బాం, వికో, నిర్మా, పెప్సీ పాటలను ఆలపించి అతిథుల చేత శెభాష్ అనిపించారు.

సంబరాల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను నాట్స్ ప్రతినిధులు భీమినేని శ్రీనివాసరావు, నూతి బాపులు అందజేశారు.

ప్రవాస యువతీయువకుల కోసం వధూవరులను వెదికేందుకు పరిచయ వేదిక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రవాసుల తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో పాల్గొని తమ పిల్లల జీవితభాగస్వాములను వెదికేందుకు సహకరించారు.

Tags-NATS Tampa 8th America Sambaralu Day2 Afternoon Nostaliga Songs Matrimonial

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles