🕑 Published: June 14, 2026 at 08:53 AM CST
ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా కువైట్ భారత రాయబార కార్యాలయంలో బ్లడ్ డోనర్స్ కేరళ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. భారత రాయబారి పరమిత త్రిపాఠి, అల్ అహ్మది గవర్నరేట్ గవర్నర్ షేక్ హమౌద్ జాబెర్ అల్ అహ్మద్ అల్ సబా ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ స్వయంగా తొలి రక్తదాతగా పాల్గొని అందరికి ఆదర్శంగా నిలిచారు. దాతలకు రాయబార కార్యాలయం ధన్యవాదాలు తెలిపింది.
