🕑 Published: November 05, 2026 at 01:43 PM CST
తెలుగు ఎక్స్‌పాట్స్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ "షటిల్ స్మాష్ సీజన్ 3" ఉత్సాహంగా సాగింది. కౌలాలంపూర్‌లోని WP Sentul కోర్ట్ లో రెండు రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో మలేషియాలోని తెలుగు ప్రవాసులు పాల్గొని తమ సత్తా చాటారు. 200కు పైగా జట్లు, 215 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పిల్లలు, మహిళలు, మిక్స్‌డ్ డబుల్స్, పురుషుల డబుల్స్, వెటరన్స్ డబుల్స్ తదితర విభాగాల్లో పోటీలు ఏర్పాటు చేశారు. పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన వారికి సంస్థ అధ్యక్షుడు అనిల్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కమ్యూనిటీ అసోసియేషన్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు బూరెడ్డి మోహన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి భాస్కరరావు హాజరయ్యారు. విజేతలకు ట్రోఫీలను అందజేసి అభినందించారు. సుబాని, చందు టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించారు. ఉపాధ్యక్షులు లక్ష్మీకాంత్ రావు, జనరల్ సెక్రటరీ ఇంద్రనీల్, మీడియా కోఆర్డినేటర్ శశి, డిప్యూటీ ఆనంద్, మహిళా సమన్వయకర్త ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు.




