వర్జీనియాలో AAVGF అవగాహన సదస్సు

🕑 Published: October 27, 2026 at 06:11 PM CST

గ్రామీణ ప్రాంత విద్య, వైద్య, అక్షరాస్యత, ఆరోగ్యం, పరిశుభ్రత, పోషణ వంటి అంశాల్లో చేయూతనిందిస్తున్న Adopt A Village Global Foundation- AAVGF సంస్థ వర్జీనియాలో 2కె వాక్ ఏర్పాటు చేసి ఆరోగ్యం-ఆనందం-సమాజసేవ అనే అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో 42 క్లస్టర్లలో 120 గ్రామాలను దత్తత తీసుకుని ప్రాధమిక అవసరాలను గుర్తించి వివిధ సేవలను అందిస్తూ లక్షలాదిమంది తెలుగువారికి ఈ సంస్థ సహకరిస్తోంది. వర్జీనియాలో జరిగిన కార్యక్రమంలో సంస్థ విధి విధానాలు, కార్యాచరణ, స్వచ్ఛ నీరు, మెడికల్ క్యాంపులు, కుష్టు వ్యాధి నిర్మూలన, మన ఆరోగ్యం మన చేతుల్లో వంటి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ, చిన్నారులకు వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

సంస్థ ప్రతినిధులు డా. భూపతిరాజు పందేటి, చంద్రశేఖర రాజు ముప్పాళ్ల మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, హరిత భారత్, వికసిత భారత్ లక్ష్యంగా సాగుతున్న మనందరి మూలాలు గ్రామీణ ప్రాంతాలతో ముడిపడ్డాయని, మన జన్మభూమికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ ఆలోచనల్లో నుండి పుట్టిన వేదికే AAVGF అని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయము చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. తెలుగు పాఠశాల అధ్యక్షుడు భానుప్రకాష్ మాగులూరి, సంస్థ సభ్యులు ప్రభాకర్ రాజు, సునీల్, ప్రియాంక, భాస్కర్రాజు, రామ్, రవి పులిగోటి, గిరి, ప్రవీణ్ ముప్పాళ్ల, మన్నే సత్యనారాయణ, ఎండూరి సీతారామారావు, చింతా రాంబాబు, రామ్మోహన్ రెడ్డి, అన్నం పూర్ణచంద్రరావు, సురేష్ రాజు, నర్సిరెడ్డి, వెంకట్రావు, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
ఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువచైనాలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుడిస్నీ దీపావళి వేడుకల్లో తొలిసారిగా కూచిపూడి నాట్యప్రదర్శనకొసరాజు పద నిఘంటువు అవసరం ఉందిస్విట్జర్లాండ్‌ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లిడెట్రాయిట్‌లో తెలుగు పఠన పోటీ..సత్తా చాటిన ప్రవాస తెలుగు బాలలుఅమెరికా బాస్...అయ్యప్పలకు యస్ - TNI ప్రత్యేకంనవంబరు 1న బాటా దీపావళి వేడుకలుశంకరరత్న పురస్కారం అందుకున్న కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులుహాంగ్‌కాంగ్‌లో డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పర్యటనఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ-దసరామిషిగన్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణబోస్టన్‌లో సందడిగా దసరా-దీపావళి వేడుకలుCanada..ఘనంగా తాకా బతుకమ్మ సంబరాలుహాంకాంగ్ తెలుగు సమాఖ్య(THKTS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుసందడిగా TPAD బతుకమ్మ సంబరంSingapore...తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుAustria...వియన్నాలో ఘనంగా బతుకమ్మ–దసరా వేడుకలుబహ్రెయిన్‌లో దసరా సంబరాలుసౌదీ అరేబియా...జెద్దాలో సందడిగా బతుకమ్మ వేడుకలు
❮ Previous Article Next Article ❯