డిస్నీ దీపావళి వేడుకల్లో తొలిసారిగా కూచిపూడి నాట్యప్రదర్శన

🕑 Published: October 26, 2026 at 01:06 PM CST

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఓర్లాండోలోని ప్రపంచ ప్రఖ్యాత వాల్ట్ డిస్నీ వరల్డ్‌లో దీపావళి డాన్స్ ఫెస్టివల్‌–2026లో తొలిసారిగా కూచిపూడి నృత్య ప్రదర్శన జరిగింది. కాలిఫోర్నియాకు చెందిన విశాఖపట్నం ప్రవాసాంధ్రురాలు, సిలికానాంధ్ర-ఆరియా విశ్వవిద్యాలయ గురు భండారి సాహితీ లత శిష్య బృందం నేతృత్వంలో శని, ఆదివారాల్లో రెండు ప్రత్యేక ప్రదర్శనలతో అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శనివారం నాడు డిస్నీ మ్యాజిక్ కింగ్‌డమ్‌లో ప్రసిద్ధ కోట ఎదుట డిస్నీ నిర్మాణ బృందం ప్రత్యేకంగా రూపొందించిన పాటకు నృత్యం చేస్తూ దీపావళి పరేడ్‌లో పాల్గొన్నారు. ఆదివారం నాడు డిస్నీ యానిమల్ కింగ్‌డమ్‌లోని ఫైండింగ్ నీమో థియేటర్‌లో జరిగిన ఇంటర్నేషనల్ డాన్స్ షోకేస్‌లో ఈ బృందం "కూచిపూడి వైభవం" పేరిట రెండో ప్రదర్శన ఇచ్చింది. 1600 మందికి పైగా ప్రేక్షకులు వీక్షించిన ఈ కార్యక్రమంలో యూకే, ఆస్ట్రేలియా, కరేబియన్ దీవులకు చెందిన కళాకారులతో పాటు తెలుగు సంప్రదాయ నృత్యమైన కూచిపూడికి ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. పిత్తడి పళ్లెంపై నిలబడి క్లిష్టమైన లయలకు అనుగుణంగా ప్రదర్శించే సంప్రదాయ తరంగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనకు అవసరమైన సామాగ్రిని తీసుకువెళ్లేందుకు ప్రత్యేక అనుమతులు తీసుకోవల్సి వచ్చిందని, డిస్నీలో ప్రదర్శనకు అవసరమైన అనుమతులు సున్నితమైన అంశాలతో ముడిపడి ఉంటాయని గురు సాహితీ తెలిపారు. దరఖాస్తుతో పాటు అనుమతుల కోసం ఏడాది కాలంగా డిస్నీ వరల్డ్‌లో కూచిపూడి ప్రదర్శనకు తాను పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.

శివుడిగా కూచిభొట్ల అనూష, కృష్ణుడిగా ఆర్యవీర్, పార్వతి, రాధ రూపాల్లో సంప్రదాయ వస్త్రాలు, ఆభరణాలతో యువ నర్తకులు భారతీయ సంస్కృతి, కళావైభవాన్ని ప్రపంచవేదికపై చాటారు. చీరకట్టుతో మిన్నీ, షేర్వాణీలో మిక్కీ ప్రత్యేకంగా భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించి ఈ నాట్య ప్రదర్శనలో పాల్గొనడం ఆకర్షణగా నిలిచింది. జొన్నవిత్తుల రచించి, రామాచారి స్వరపరిచిన ప్రత్యేక గీతానికి డిస్నీ వేదికపై ఈ కూచిపూడి ప్రదర్శన ఇచ్చారు. ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన ప్రదేశంలో (The Happiest Place On Earth - Disney Slogan) ఈ ఘనత సాధించి తెలుగువారితో పాటు మన కళా సంప్రదాయానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చిన గురు సాహితీ బృందాన్ని పలువురు అభినందించారు.

📲 Join Our WhatsApp Channel
కొసరాజు పద నిఘంటువు అవసరం ఉందిస్విట్జర్లాండ్‌ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లిడెట్రాయిట్‌లో తెలుగు పఠన పోటీ..సత్తా చాటిన ప్రవాస తెలుగు బాలలుఅమెరికా బాస్...అయ్యప్పలకు యస్ - TNI ప్రత్యేకంనవంబరు 1న బాటా దీపావళి వేడుకలుశంకరరత్న పురస్కారం అందుకున్న కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులుహాంగ్‌కాంగ్‌లో డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పర్యటనఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ-దసరామిషిగన్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణబోస్టన్‌లో సందడిగా దసరా-దీపావళి వేడుకలుCanada..ఘనంగా తాకా బతుకమ్మ సంబరాలుహాంకాంగ్ తెలుగు సమాఖ్య(THKTS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుసందడిగా TPAD బతుకమ్మ సంబరంSingapore...తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుAustria...వియన్నాలో ఘనంగా బతుకమ్మ–దసరా వేడుకలుబహ్రెయిన్‌లో దసరా సంబరాలుసౌదీ అరేబియా...జెద్దాలో సందడిగా బతుకమ్మ వేడుకలుదుబాయి...IPF ఆధ్వర్యంలో బతుకమ్మమలేషియాలో ఘనంగా MYTA 13వ బతుకమ్మ వేడుకలుమలేషియాలో వేడుకగా FNCA బతుకమ్మ
❮ No Previous Next Article ❯