తానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం..అవధాన గురుభ్యోనమః

🕑 Published: October 30, 2026 at 04:00 PM CST

తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో గత ఆరున్నర సంవత్సరాలగా “నెల నెలా తెలుగు వెలుగు” పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్యసమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 97వ అంతర్జాల సమావేశం అవధాన గురుభ్యోనమః పేరిట నిర్వహించారు. సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో ఈ కార్యక్రమం ప్రారంభమయింది. ప్రత్యేక అతిథి సహస్రావధాని డా. కడిమిళ్ళ వరప్రసాద్ మాట్లాడుతూ అవధాన రంగంలో సుప్రసిద్ధులైన వారిలో ఆరుగురు అవధానులు ఒకే వేదికపై పాల్గొని తమను అవధానులుగా తీర్చిదిద్దిన గురువులకు కృతజ్ఞతలు తెలియజేయడం ఇదే తొలిసారి అని తెలిపారు. కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర వారి బృందం అభినందనీయులు అన్నారు. తెలుగు వారికే సొంతమైన అవధాన ప్రక్రియను పరిరక్షిస్తున్న అవధానులకు ఆశీస్సులు అందజేశారు. వీరిని స్పూర్తిగా తీసుకుని అవధానులు తయారు కావాలని ఆకాంక్షించారు.

డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆశుకవిత్వం, సమయస్ఫూర్తి, సృజనాత్మకత కలగలిసిన అరుదైన ప్రతిభ అవధాన ప్రక్రియ అని అలాంటి విద్యను మనకు వారసత్వంగా అందించిన, అందిస్తున్న సాహితీమూర్తులకు, అవధాన గురువులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ అవధాన గురువందనం కార్యక్రమంలో సహస్రావధాని కోట వేంకట లక్ష్మీనరసింహం తన గురువు డా. కడిమిళ్ళ వరప్రసాద్ గురించి, శతావధాని డా. ఆముదాల మురళి తన గురువు "పద్మశ్రీ" డా. ఆశావాది ప్రకాశరావు గురించి, ద్విశతావధానిని డా. బులుసు అపర్ణ తన గురువు డా. ధూళిపాళ మహాదేవమణి గురించి, అష్టావధాని డా. బోచ్కర్ ఓమ్ప్రకాశ్ తన గురువులు డా. అవధానం రంగనాథ వాచస్పతి, డా. ఆయాచితం నటేశ్వరశర్మ, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గురించి, శతావధాని నల్లాన్ చక్రవర్తుల సాహిత్ తన గురువులు పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు, అన్నమరాజు ప్రభాకరరావు, డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, డా. ఆముదాల మురళిల గురించి, అష్టావధాని యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు తన గురువులు డా. ఉమర్ ఆలీషా, ఏ. సచ్చిదానందమూర్తిల గురించి ప్రస్తుతించారు.

📲 Join Our WhatsApp Channel
వైకాపా అమెరికా సలహాదారులుగా 8మంది నియామకం36 Students Receive White Coats at St Martinus University in CuraçaoGlobal Telangana Association GTA Mega Batukamma In Virginiaవైభవంగా సాగిన టాంటెక్స్ 40వ వార్షికోత్సవంలండన్‌..వైభవంగా క్రొయ్దన్ తెలుగు సంఘం బతుకమ్మ-దసరాషాంఘై ప్రపంచ తెలుగు సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్న హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య సభ్యులుడెట్రాయిట్‌లో ఘనంగా జరిగిన GTA బతుకమ్మ-దసరావర్జీనియాలో AAVGF అవగాహన సదస్సుఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువచైనాలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుడిస్నీ దీపావళి వేడుకల్లో తొలిసారిగా కూచిపూడి నాట్యప్రదర్శనకొసరాజు పద నిఘంటువు అవసరం ఉందిస్విట్జర్లాండ్‌ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లిడెట్రాయిట్‌లో తెలుగు పఠన పోటీ..సత్తా చాటిన ప్రవాస తెలుగు బాలలుఅమెరికా బాస్...అయ్యప్పలకు యస్ - TNI ప్రత్యేకంనవంబరు 1న బాటా దీపావళి వేడుకలుశంకరరత్న పురస్కారం అందుకున్న కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులుహాంగ్‌కాంగ్‌లో డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పర్యటనఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ-దసరామిషిగన్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణ
❮ No Previous Next Article ❯