రాజీలేని పాలన సాగించిన జగన్ - డల్లాస్‌లో ధనంజయరెడ్డి

🕑 Published: October 31, 2026 at 10:12 AM CST

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి రాజీలేని పాలన చేశారని వైద్య, ఆరోగ్య రంగాల్లో పెనువిప్లవాలు తీసుకువచ్చి యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచారని ఆయన సెక్రటరీగా పనిచేసిన రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి కె.ధనంజయరెడ్డి అన్నారు. శుక్రవారం నాడు అర్వింగ్‌లో స్థానిక ప్రవాసులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. కరోనా సమయంలో 26వేల కోట్లు రాబడి నష్టం, మరో 21వేల కోట్లు పథకాల ఖర్చు వెరసి మొత్తం 47వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని అమలుచేసి తీరాల్సిందేనని పట్టుబట్టి, మొండితనంగా, రాజీలేని పాలన చేసిన ఘనత జగన్‌కు దక్కుతుందని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీ, నాడు-నేడు వంటి పథకాలను భారత ప్రభుత్వం అధ్యయనం చేసి స్వారూప్యత ఉండే కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టిందని ఆయన గుర్తు చేశారు. కరోనా సమయంలో చేసిన సేవలకు WHO గుర్తింపు పొందిన ఏకైక దక్షిణాసియా రాష్ట్రంగా ఏపీ నిలిచిందని పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెక్‌మార్క్‌లు పెట్టుకుని ఖచ్చితంగా అన్నీ అమలు అయ్యకే ఎన్నికలకు వెళ్ల్లాలని జగన్ దీక్ష పూనారని తెలిపారు. దురదృష్టవశాత్తు తాము చేసిన పనులను ప్రజల్లోకి సరిగ్గా తీసుకుని వెళ్లలేకపోయామని అదే ఆయన ఓటమికి కారణం అయిందని విశ్లేషించారు.

తాను ఐ.ఏ.ఎస్. అవ్వాలని తన తండ్రి కన్న కలల కోసం కష్టపడుతున్న సమయంలో తమ ఊరిలో ఎన్నికలు వచ్చాయని, తనను నిలబెడితే ప్రత్యర్థులు ఏకగ్రీవంగా ఒప్పుకుంటామని చెప్పిన కారణంగా తాను గ్రామ సర్పంచ్ కావాల్సి వచ్చిందని ధనంజయరెడ్డి తెలిపారు. అలా సర్పంచ్‌గా ఉంటూనే ఢిల్లీలో సివిల్స్ శిక్షణ తీసుకుని ఐ.ఏ.ఎస్‌కు ఎంపిక అయ్యాయని తెలిపారు. ఈ సమయంలోనే వై.ఎస్‌తో మంచి అనుబంధం ఏర్పడిందని అది జగన్ వరకు కొనసాగిందని వెల్లడించారు.

సభలో ప్రసంగించిన వక్తలు కార్యకర్తల మనోభావాలను, కష్టాలను, అభిప్రాయలను అధినేత వద్దకు తప్పకుండా తీసుకువెళ్లాలని సూచించారు. గత ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై పార్టీపరంగా విచారణ చేపట్టి నిజాలను వెలికితీయాలని కోరారు. కార్యక్రమంలో క్రిస్టపాటి రమణరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, కోడూరు కృష్ణారెడ్డి, రావు కల్వల, డా. శ్రీనాథ్, డా. పవన్, అన్నపురెడ్డి శివ, తిరుమల్ రెడ్డి, దర్గా నాగిరెడ్డి, డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

📲 Join Our WhatsApp Channel
తానా ప్రపంచసాహిత్యవేదిక 97వ సమావేశం..అవధాన గురుభ్యోనమఃవైకాపా అమెరికా సలహాదారులుగా 8మంది నియామకం36 Students Receive White Coats at St Martinus University in CuraçaoGlobal Telangana Association GTA Mega Batukamma In Virginiaవైభవంగా సాగిన టాంటెక్స్ 40వ వార్షికోత్సవంలండన్‌..వైభవంగా క్రొయ్దన్ తెలుగు సంఘం బతుకమ్మ-దసరాషాంఘై ప్రపంచ తెలుగు సదస్సులో ఉత్సాహంగా పాల్గొన్న హాంగ్‌కాంగ్ తెలుగు సమాఖ్య సభ్యులుడెట్రాయిట్‌లో ఘనంగా జరిగిన GTA బతుకమ్మ-దసరావర్జీనియాలో AAVGF అవగాహన సదస్సుఉత్తర అమెరికాలో ఏపీ పెట్టుబడుల సమన్వయకర్తగా సతీష్ మండువచైనాలో వైభవంగా 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుడిస్నీ దీపావళి వేడుకల్లో తొలిసారిగా కూచిపూడి నాట్యప్రదర్శనకొసరాజు పద నిఘంటువు అవసరం ఉందిస్విట్జర్లాండ్‌ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లిడెట్రాయిట్‌లో తెలుగు పఠన పోటీ..సత్తా చాటిన ప్రవాస తెలుగు బాలలుఅమెరికా బాస్...అయ్యప్పలకు యస్ - TNI ప్రత్యేకంనవంబరు 1న బాటా దీపావళి వేడుకలుశంకరరత్న పురస్కారం అందుకున్న కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులుహాంగ్‌కాంగ్‌లో డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పర్యటనఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ-దసరా
❮ No Previous Next Article ❯