కొసరాజు పద నిఘంటువు అవసరం ఉంది

🕑 Published: October 26, 2026 at 06:47 AM CST

కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరి సర్వలభ్య రచనల ఆవిష్కరణ ఆదివారం నాడు ఫ్రిస్కోలో నిర్వహించారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక, కళావాహిని, టాంటెక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కొసరాజు కవితావైభవం పేరిట సిద్ధాంత వ్యాసాన్ని రచించి నాగార్జున విశ్వవిద్యాలయం నుండి పీ.హెచ్.డీ పట్టాతో పాటు బంగారు పతకం అందుకున్న ప్రముఖ రచయిత డా. నల్లూరి రామారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామారావు మాట్లాడుతూ మట్టి పరిమళాలను గట్టిగా పట్టుకుని కొసరాజు జానపదాలకు సరికొత్త సువాసనలు అద్దారని కొనియాడారు. ఆయన రచనలను ఉటంకించారు. శ్రీనాథ పద నిఘంటువు, తిక్కన పదకోశం మాదిరి కొసరాజు పద నిఘంటువు రూపొందించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేశారు. పల్లెజీవనశైలిని అతిసమీపంగా గమనించిన ఆయన వాటినే తన పాటలకు పునాదులుగా చేసుకున్నారని తెలిపారు. కొసరాజు రచించిన గండికోట యుద్ధం ఆయనలోని మరో కోణాన్ని స్పృశిస్తుందని వెల్లడించారు.

మద్దుకూరి చంద్రహాస్ మాట్లాడుతూ వ్యంగ్యానికి, హాస్యానికి చిరునామాగానే గాక దూరదృష్టితో వాస్తవికతను ప్రతిబింబించే రచనలు చేసిన ప్రతిభాశాలి కొసరాజు అని కొనియాడారు. టోపీ, లారీ, సిగరెట్, ఇల్లరికం, పేకాట, పకోడి..ఇలా వస్తువు ఏదైనా సహజసిద్ధమైన పదజాలంతో రాఘవయ్య మంచి పాటలు వ్రాశారని వెల్లడించారు. డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ రాఘవయ్య చౌదరి జానపద కవితా రసరాజుగా చిరస్మరణీయులని పేర్కొన్నారు. రైతు అన్నదాత, కవి జ్ఞానదాత అని ఇవి రెండూ కలిసిన కొసరాజు సాహితీ చైతన్య ప్రదాత అని అన్నారు. నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్న రాఘవయ్య పరిశ్రమతో, పల్లెకారుల జీవనాన్ని సమీపంగా చూసిన అనుభవాలతో ఆలోచింపజేసే పాటలకు ప్రాణం పోశారని వెల్లడించారు. కొసరాజు సాహిత్యాన్ని రూపొందించే క్రమంలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. అనంత్ మల్లవరపు సమన్వయపరిచిన ఈ కార్యక్రమంలో స్థానిక గాయనీగాయకులు కొసరాజు రచించిన గేయాలను ఆలపించారు.

📲 Join Our WhatsApp Channel
స్విట్జర్లాండ్‌ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లిడెట్రాయిట్‌లో తెలుగు పఠన పోటీ..సత్తా చాటిన ప్రవాస తెలుగు బాలలుఅమెరికా బాస్...అయ్యప్పలకు యస్ - TNI ప్రత్యేకంనవంబరు 1న బాటా దీపావళి వేడుకలుశంకరరత్న పురస్కారం అందుకున్న కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి దంపతులుహాంగ్‌కాంగ్‌లో డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పర్యటనఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో బతుకమ్మ-దసరామిషిగన్‌లో శంకర నేత్రాలయ నిధుల సేకరణబోస్టన్‌లో సందడిగా దసరా-దీపావళి వేడుకలుCanada..ఘనంగా తాకా బతుకమ్మ సంబరాలుహాంకాంగ్ తెలుగు సమాఖ్య(THKTS) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుసందడిగా TPAD బతుకమ్మ సంబరంSingapore...తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలుAustria...వియన్నాలో ఘనంగా బతుకమ్మ–దసరా వేడుకలుబహ్రెయిన్‌లో దసరా సంబరాలుసౌదీ అరేబియా...జెద్దాలో సందడిగా బతుకమ్మ వేడుకలుదుబాయి...IPF ఆధ్వర్యంలో బతుకమ్మమలేషియాలో ఘనంగా MYTA 13వ బతుకమ్మ వేడుకలుమలేషియాలో వేడుకగా FNCA బతుకమ్మఎన్‌టీఆర్ డిజిటల్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
❮ No Previous Next Article ❯