ఆరవ అంతర్జాతీయ శివపదం పోటీ

🕑 Published: May 25, 2026 at 08:27 AM CST

ఆరవ అంతర్జాతీయ శివపదం పోటీలలో ప్రపంచంలోని అనేక దేశాల నుండి వచ్చిన ఐదు వందల మంది పాల్గొని శివపదాలను గానం మరియు నృత్య రూపాలలో అద్భుతంగా ప్రదర్శించి అందరినీ ఆనందింపజేశారు.

బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేదం శణ్ముఖశర్మవెయ్యికి పైగా శివపదాలను రచించగా, అవి దేశ విదేశాలలో గాన, నృత్య రూపాలలో విస్తృతంగా ప్రదర్శించబడుతున్నాయి. ఈ ప్రదర్శనల ద్వారా సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతోంది.

ఋషిపీఠం మరియు శివ పదంఅంతర్జాతీయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ “6వ గ్లోబల్ శివపదం కాంపిటీషన్స్” విజయవంతంగా ముగిశాయి. ఈ కార్యక్రమాన్ని వాణీ గుండ్లపల్లి గారి నాయకత్వంలో మేఘనా నాగసంపత్ వారణాసి, విజయ శ్రీకాంత్ బట్లమని, మాధవి శ్రీనివాస్ మేడూరి, లలిత హరిదొడ్డి, నాగవల్లి పవన్ టోలేటి ,రవి శంకర్ గుండ్లాపల్లి తదితరులు సమన్వయం చేసి అత్యంత ఘనంగా నిర్వహించారు.

పలు దేశాల నుండి వచ్చిన యాభై మంది న్యాయనిర్ణేతలు ఈ పోటీలకు జడ్జింగ్ నిర్వహించగా, ఐదు వందల మంది కళాకారులు గానం మరియు నృత్య విభాగాలలో పాల్గొన్నారు. పది రోజుల పాటు సాగిన ఈ శివపద యజ్ఞం ఒక మహా ఆధ్యాత్మిక సాంస్కృతిక యజ్ఞంగా రూపుదిద్దుకుంది.

ఈ కార్యక్రమంలోని ప్రత్యేక ఆకర్షణగా జగద్గురు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి ఆశీస్సులతో కాంచీ సంప్రదాయ పాఠశాలల నుండి ఎనభై ఏడుమంది విద్యార్థులు పాల్గొనడం విశేషం.

సామవేదం శణ్ముఖశర్మగారు కాంచీ మహాస్వామివారి కి వారి పైన వారు రచించిన ఈ శివపదాలు పైన అభిమానం అని చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఇంతమంది ద్వారా ఆలపించబడడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఋషి పీఠం ఈ సంవత్సరం అంతర్జాతీయ స్థాయిలో పోటీలు ఘనవిజయంగా నిర్వహించబడటం ప్రతి ఒక్కరికీ గర్వకారణమైంది.

📲 Join Our WhatsApp Channel
వర్జీనియాలో ఘనంగా మినీ మహానాడునెబ్రాస్కాలో వైభవంగా తెలుగు బడి వార్షికోత్సవంకొలంబియా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో కీలకోపన్యాసం చేసిన సరయు బేతెంచర్లవైభవంగా నెబ్రాస్కా తెలుగు సమితి ఉగాదికాన్సాస్‌లో మురళీమోహన్‌కు స్వర్ణ సత్కారంజీయర్ ట్రస్ట్-నాట్స్‌ల ఆధ్వర్యంలో సీతారామా కళ్యాణంఅనంతవరం వెంకన్న ఆలయ పంచతల రాజగోపురం నిర్మాణానికి తితిదే బోర్డు ఆమోదంఅమెరికా పార్కుల్లో తెలుగు కబుర్లు-TNI ప్రత్యేకంDeepica Mutyala Inspires UT McCombs Graduatesడా. నోరికి తెలుగు కళాసమితి ఉగాది పురస్కారంSaanvi Gullapalli Donates 5000 USD To North Texas FoodBankసింగపూర్‌లో 409వ సారి భాగవత సప్తాహం చేసిన వద్దిపర్తిA HUB GLOBAL Hosts Investor Launch of "Yadadri Hills"ATA Conducts Chess Tournament Successfully in Extonతానా మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో వీలునామాపై అవగాహన సదస్సుడల్లాస్‌లో "అమానా" ఆధ్వర్యంలో ఈద్ మిలాప్ వేడుకలుతెలుగు సింగపూర్ ప్రీమియర్ లీగ్ 2026వరంగల్ రైతు సభను విజయవంతం చేయండి - ఆస్ట్రేలియా ఎన్నారై బిఆర్ఎస్స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ సప్తమ వార్షికోత్సవంవేడుకగా సెయింట్ మార్టినస్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం
Previous Article Next Article