ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత మంచిది-సిలికానాంధ్ర ఉగాది వేడుకల్లో యార్లగడ్డ

Featured Image

మాతృభాషతో పాటు ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత ప్రయోజనం నేర్చుకున్నవారికి ఉంటుందని తప్ప భాషకు ఏ విధమైన లబ్ధి ఉండదని విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. శనివారం నాడు సిలికానాంధ్ర ఆధ్వర్యంలో బే-ఏరియాలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన త్రిభాషాసూత్రం జాతీయ సమైక్యతకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రతిపాదనలో హిందీ భాషను తప్పనిసరిగా నేర్చుకోవాలని ఎక్కడా లేదని, మాతృభాషతో పాటు వేరే ఏదైనా భారతీయ భాషను అధ్యయనం చేయాలని మాత్రమే ఉందని అన్నారు. ఇది తల్లిదండ్రులు, విద్యార్థులు, ఆయా రాష్ట్రపభుత్వాల ఇష్టమని వెల్లడించారు.

విదేశాంధ్రులు భారతీయ సంస్కృతి, తెలుగు ఆచార వ్యవహారాలు, సంప్రదాయల పరిరక్షణలో ముందుండటం, వాటిని భావితరాలకు అందించడంలో వారు చేస్తున్న కృషిని లక్ష్మీప్రసాద్ అభినందించారు. సిలికానాంధ్ర వ్యవస్థాపకుడు కుచిభొట్ల ఆనంద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలొ SFO భారత కాన్సుల్ జనరల్ శ్రీకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గరికిపాటి వెంకటప్రభాకర్ 'స్వరరాగావధానం' ఆకట్టుకుంది. అనంతరం అరిటాకులో అచ్చతెనుగు భోజనం ఏర్పాటు చేశారు.

Tags-Learn As Many Languages As You Can - YLP In SiliconAndhra Ugadi 2025

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles