వాషింగ్టన్ డీసీలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Featured Image

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తానా పాఠశాల ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భాను మాగులూరి సమన్వయపరిచిన ఈ వేడుకల్లో జాతీయ జెండాను, అమెరికా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఆముదాలవలస శాసనసభ్యులు కూన రవికుమార్, మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుల పోరాటాలు, త్యాగాలను నిరంతరం గుర్తుచేసుకోవాలన్నారు. యాష్ బొద్దులూరి, రామ్ చౌదరి ఉప్పుటూరి, శ్రావ్య చామంతి, బోనాల రామకృష్ణ, రమేష్ అవిరినేని, గోన మోహనరావు, మేకల సంతోష్ రెడ్డి, బండి సత్యబాబు, నంబూరి చంద్రనాథ్, వనమా లక్ష్మీనారాయణ, చల్లా సుబ్బారావు, వనమా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags-Indian Independence Day Celebrations In Washington DC

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles