వేడుకగా తాకా సంక్రాంతి సంబరాలు

Featured Image

తెలుగు అసోసియేషన్ ఆఫ్ కెనడా(TACA) ఆధ్వర్యంలో శనివారం నాడు ఎటోబికోలోని మైకేల్ జే. పవర్ – సెయింట్ జోసెఫ్ హైస్కూల్ లో సంక్రాంతి సంబరాలు వేడుకగా నిర్వహించారు. ప్రధాన కార్యదర్శి మల్లికార్జునచారి స్వాగతోపన్యాసం చేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులకు రుచికరమైన తెలుగు వంటకాలతో పాటు నేతి అరిసెలు అందజేశారు. 150 మంది కళాకారులు ఐదు గంటలకు పైగా చేసిన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.

మంజునాథ్ పూజారి ఆధ్వర్యంలో ప్రవాస చిన్నారులకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదించారు. ప్రవీణ్ చిమట, గౌతమ్ కొల్లూరిలు వేడుకల సమర్పకులుగా వ్యవహరించగా తాకా కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది. టోరంటో టైమింగ్స్‌తో కూడిన తెలుగు క్యాలెండర్‌ను ఆవిష్కరించి అతిథులకు పంపిణీ చేశారు. తాకా అధ్యక్షుడు ప్రసన్న తిరుచిరాపల్లి అతిథులకు శుభాకామ్షలు తెలిపారు. తాకా కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. పాలక మండలి సభ్యులు, ఉపాధ్యక్షురాలు వాణి జయంతి, ప్రధాన కార్యదర్శి మల్లిక్ చారి, కోశాధికారి ప్రదీప్ రెడ్డి, డైరెక్టర్లు అశ్విత, ప్రశాంతి, యశ్వంత్, కళ్యాణ్, వ్యవస్థాపక అధ్యక్షులు, చారి సామంతపూడి, ట్రస్టీ ఛైర్ కల్పన మోటూరి, ట్రస్టీలు అనిత సజ్జ, ప్రవీణ్ పెనుబాక, పవన్ కుమార్ బసాని, ఆదిత్య వర్మ, మాజీ అధ్యక్షులు రమేష్ మునుకుంట్ల, వ్యవస్థాపక సభ్యులు అరుణ్ కుమార్ లయం తదితరులు పాల్గొన్నారు.

Tags-TACA Pongal 2026 In Toronto Canada

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles