భాజపా తీర్థం పుచ్చుకున్న తానా ఫౌండేషన్ మాజీ ఛైర్మన్ యార్లగడ్డ

Featured Image

తానా సంస్థ సేవా విభాగమైన ఫౌండేషన్‌కు ఛైర్మన్‌గా సేవలందించిన గుంటూరు జిల్లాకు చెందిన మిస్సిస్సిప్పి ప్రవాసాంధ్రుడు యార్లగడ్డ వెంకటరమణ సోమవారం నాడు భారతీయ జనతా పార్టీలో జేరారు. ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆయనకు శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రధాని మోదీ విధానాలు, దేశాభివృద్ధికి పార్టీ చేస్తున్న కృషి నచ్చి తాను భాజపాలో జేరుతున్నట్లు వెంకటరమణ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర మీడియ వ్యవహరాల ఇన్‌ఛార్జి పాతూరి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Tags-TANA Foundaion Ex Chairman Yarlagadda Venkataramana Joins BJP, Daggubati Purandeswari TANA

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles