సింగపూర్ రచయత్రికి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం

Featured Image

ప్రముఖ కథా రచయిత్రి, కవయిత్రి, వ్యాఖ్యాత్రి, శ్రీ సాంస్కృతిక కళాసారథి - సింగపూర్ సంస్థ ప్రధాన కార్యనిర్వాహకవర్గ సభ్యురాలు రాధిక మంగిపూడి, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారానికి ఎంపిక అయ్యారు. 2023 సంవత్సరానికిగాను వివిధ రంగాలలో ప్రసిద్ధిగాంచిన 48 మందిని ఎంపిక చేసినట్లుగా, వారిలో హాస్య రచనల విభాగంలో రాధిక ఎంపికయ్యారని తెలుగు విశ్వవిద్యాలయం పత్రికా ప్రకటనలో తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాల కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

రాధిక 2016లో సింగపూర్లో తన సాహితీ ప్రస్థానం ప్రారంభించి ఇప్పటివరకు 3 కథా సంపుటులు, 2 కవితా సంపుటలు, 2 పద్య శతకాలు, ఒక వ్యాస సంపుటి రచించారు. ఆగస్టు 16వ తేదీ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో హ్యూస్టన్ మహానగరంలో జరిగిన '14వ అమెరికా తెలుగు సాహితీ సదస్సు'కు అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఆమె 8వ పుస్తకం 'కథ కంచికి' కథా సంపుటి సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ ఆవిష్కరించారు. రాధికను శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షుడు రత్నకుమార్, డా. వంశీ రామరాజు, వంగూరి చిట్టెన్ రాజు తదితరులు అభినందించారు. త్వరలో హైదరాబాద్లో పురస్కార ప్రదాన కార్యక్రమం నిర్వహిస్తామని విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య నిత్యానందరావు తెలిపారు.

Tags-Singapore NRI Telugu Writer Radhika Mangipudi Nominated To Telugu Univ Award

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles