
భాష-సేవ-యువత...ఇవే నా లక్ష్యాలు-TNIతో నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి ముఖాముఖి

ఎందరో వైద్యులు, వ్యాపారవేత్తలు, ప్రవాసుల ధృఢసంకల్పంతో 2009లో ప్రారంభమై 16ఏళ్ల పాటు సుదీర్ఘంగా సేవలందించి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరుకు చెందిన న్యూజెర్సీ ప్రవాసాంధ్రుడు మందాడి శ్రీహరి ఇటు అమెరికాలో ఉన్న ప్రవాస యువతను, అటు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే విద్యార్థులను సంస్థకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. సేవ ద్వారా మాత్రమే సంస్థ ముందుకు సాగుతుందని విశ్వసించే నాట్స్ అధ్యక్షుడు మందాడి శ్రీహరితో TNI ప్రత్యేక ముఖాముఖి..మీకోసం!
2010 నుండి నాట్స్‌తో కలిసి పయనిస్తున్న ఆయన 2011లో సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు వెల్లడించారు. నాట్స్‌లో పలు బాధ్యతలను సమర్థంగా నిర్వహించిన ఆయన 2013లో నార్త్ ఈస్ట్ జోనల్ వైస్-ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు బోస్టన్, హారిస్బర్గ్, కనెక్టికట్ వంటి విభాగాల ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. 2017 నుండి నాలుగు సార్లు నాట్స్ బోర్డులో డైరక్టరుగా సేవలందించారు. సంస్థలో శ్రీహరి పోషిస్తున్న చురుకైన పాత్రను, ముందుండే తత్త్వాన్ని గుర్తించిన నాయకత్వం డైరక్టరుగా బాధ్యతలు నిర్వహిస్తున్న నాలుగో పర్యాయంలో ఆయన సేవలకు గుర్తింపుగా అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. న్యూజెర్సీలో ఉచిత వైద్య శిబిరాలు, క్రీడా పోటీలు, ఆర్థిక, మహిళ, బాలల సంబంధ సమాజ సేవా కార్యక్రమాల నిర్వహణలో ఆయన కీలక భూమిక పోషించారు.
వినూత్నమైన, నవీనమైన, ప్రజాపయోగ సేవా కార్యక్రమాల రూపకల్పనలో నాట్స్‌ది అగ్రస్థానమన్న శ్రీహరి 1-8884-TELUGU ద్వారా అమెరికాలోని తెలుగువారికి అత్యవసర హెల్ప్‌లైన్, ఉచిత వైద్య సలహాల కోసం వైద్యుల పర్యవేక్షణలో నిర్వహిస్తున్న Ask-A-Doctor, అమెరికావ్యాప్తంగా రహదారులను దత్తత తీసుకుని వాటిని శుభ్రం చేసే Adopt-A-Highway, తెలుగు భాష వికాసం కొరకు లలిత కళావేదిక వంటి అమూల్యమైన కార్యక్రమాలను ఇప్పటికే నిర్వహిస్తున్నామని, వీటి బలోపేతానికి తన హయాంలో మరింత కృషి చేస్తానని వెల్లడించారు.
నాట్స్ 2.0 విజన్‌లో భాగంగా తన భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడిన శ్రీహరి...ఇండియా నుండి వచ్చే తెలుగు విద్యార్థులకు వైద్య బీమా సదుపాయం నాట్స్ ద్వారా కల్పించే ప్రణాళికను విస్తరిస్తామని అన్నారు. అమెరికాలోని ప్రవాస తెలుగు యువతకు నాట్స్‌ను చేరువ చేసే లక్ష్యంలో భాగంగా నాట్స్ నిర్వహించే సేవా కార్యక్రమాలను స్థానిక ప్రవాస తెలుగు యువతీయువకులను భాగస్వామ్యం చేసి Presidential Volunteer Service Awardను వారికి అందజేస్తామని..తద్వారా వారు ఉన్నత చదువులకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఈ పురస్కారం వారికి మరింతగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. నాట్స్ సంస్థకు ఈ అవార్డును అందజేసేందుకు గుర్తింపు ఉందని శ్రీహరి తెలిపారు. అటు సేవా-ఇటు భవిత రెండింటికి నాట్స్‌ను ఒక బలమైన వారధిగా నిలబెట్టడం తన ప్రధాన లక్ష్యాలని పేర్కొన్నారు.
ఉత్తర అమెరికాలో తెలుగు భాష పరివ్యాప్తికి నాట్స్ సదా కృషి చేసిందని పేర్కొన్న శ్రీహరి అమెరికాలో జన్మించిన వారు సులువుగా భాషను ఆకళింపు చేసుకునే నిమిత్తం ఒక సరికొత్త డిజిటల్ ప్లాట్‌ఫాంను సైతం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నామని అన్నారు. ఇప్పటి వరకు అమెరికావ్యప్తంగా ఉన్న 22 నాట్స్ విభాగాలను తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో మరిన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రస్తుత బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ మార్గనిర్దేశంలో తాను, తన కార్యవర్గ బృందం ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిపారు. నాట్స్ ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతదే తుది సమాధానమని అన్నారు. ప్రతి నెల జరిగే కార్యవర్గ సమావేశంలో తప్పనిసరిగా సంస్థ జమ-ఖర్చులను సభ్యులందరికీ అందజేస్తామని, వాటిపైన అధ్యక్షుడు లేదా బోర్డు ఛైర్మన్ ఆమోదముద్ర ఖచ్చితంగా ఉండాలనే పారదర్శక నిబంధన దిక్సూచిగా తాము ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
25మంది కార్యవర్గ సభ్యులు, 25మంది బోర్డు సభ్యులు, అయిదుగురు వ్యవస్థాపక సభ్యులతో నాట్స్ కార్యనిర్వాహక బృందం పనిచేస్తుంది. వివాదాల పరిష్కారానికి వ్యవస్థాపక సభ్యుల కమిటీదే తుదినిర్ణయం. అధ్యక్ష పదవిలో శ్రీహరి ఏడాది పాటు సేవలందిస్తారు. సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాటు చేయబడిన నాట్స్‌లో నిష్కళంకంగా, నిస్వార్థంగా, సమర్థంగా పనిచేస్తే తప్పనిసరిగా గుర్తింపు వస్తుందని నిరూపించడానికి తానే నిదర్శనమని మందాడి శ్రీహరి తెలిపారు. పదవిని అలంకరణగా గాక బాధ్యతగా నిర్వహించే శ్రీహరికి ప్రవాసులు అభినందనలు తెలిపారు. జులై 4,5,6 తేదీల్లో ఫ్లోరిడాలోని టాంపాలో జరిగే నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలకు ప్రవాసులు పెద్దసంఖ్యలో హాజరయి సభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు www.sambaralu.orgను చూడవల్సిందిగా సూచించారు.
---సుందరసుందరి(sundarasundari@aol.com)
Register for NATS 8th America Telugu Sambaralu In Tampa, Florida, USA On July 4-6 - www.sambaralu.org
Tags-Special Interview With NATS 2025 President Mandadi Srihari
Gallery











Latest Articles
- Samantha To Shine At Tana 2025 Conference Detroit
- Tana 2025 Election Selection Updates
- Chitra Thaman And Movie Celebrities At Tana 24Th Conference
- Nri Brs Ireland Team Launched
- Nats Starts Nevada Chapter
- Gorati Venkanna Felicitated With Manakalapu Mahakavi In Dallas
- Ata Dallas Celebrates Mothers Day 2025
- Brs Silver Jubilee Celebrations Might Happen In Singapore
- Nats Sambaralu July 4Th Long Weekend Ticket Prices
- Sampoornananda Giri Swamyji Visits Ims Indianapolis