డీసీలో 'అరాచకంపై అక్షర సమరం' పుస్తకావిష్కరణ

Featured Image

తెదేపా సీనియర్ నేత, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు రచించిన ‘అరాచకంపై అక్షర సమరం’ పుస్తకాన్ని వాషింగ్టన్ డీసీలో రఘురామకృష్ణరాజు, కే రాఘవేంద్రరావు కలిసి ఆవిష్కరించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, ప్రజలపై జరిగిన దుర్మార్గాలు, నేర రాజకీయాల బహిరంగ రూపాన్ని ఈ వ్యాస సంపుటిలో వెల్లడించారని రఘురామకృష్ణరాజు అన్నారు. సుబ్బారావు 200కుపైగా వ్యాసాలు రాసి ప్రజల గొంతుకగా మారారని పేర్కొన్నారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో హింస, వేధింపులు, అణచివేతలు జరిగాయని, ఇవన్నీ సామూహిక విషాదాలుగా మన్నవ తన రచనల్లో ప్రతిబింబించారని అన్నారు.

వసంతకృష్ణప్రసాద్ ప్రజాస్వామ్యం బలోపేతానికి ప్రశ్నించడం అవసరమని, అవినీతి పాలనపై సుబ్బారావు వ్యాసాలు ప్రభావం చూపాయని అన్నారు. మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ జగన్ పాలనలో పౌర హక్కులు సైతం కాలరాశారని, ప్రజల్ని చైతన్యపరచడమే తన లక్ష్యమని చెప్పారు. సతీష్ వేమన దేశంలో ఎక్కడా లేని అమానుష చట్టాలపై మన్నవ అక్షర సమరం చేశారని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో భాను మాగలూరి, సుధీర్ కుమ్మి తదితరులు పాల్గొన్నారు.

Tags-Raghuramaraju Raghavendrarao Launches Arachakampai Akshara Samaram Book in Washington DC

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles