చికాగోలో శంకర నేత్రాలయ అవగాహన సదస్సు

Featured Image

అంధత్వ నివారణ లక్ష్యంతో శంకర నేత్రాలయ చికాగో చాప్టర్ డిసెంబర్ 13న అరోరాలో చలనచిత్ర సంగీత కచేరీని నిర్వహించింది. గ్రామీణప్రాంతాల్లోని నిరుపేదలకు కంటి సంరక్షణ, వైద్య సేవలపై అవగాహన పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. నగరానికి చెందిన నృత్య కళాకారులు శాస్త్రీయ, చలనచిత్ర నృత్యాలతో ప్రదర్శనలు ఇచ్చారు. చికాగో గాయకులు ప్రవీణ్ కుమార్ జాలిగమ, మణి తెల్లా ప్రగడ, పరిమళా ప్రసాద్, సినీ గాయకులు పార్థు, మల్లికార్జున్, సుమంగళి చలనచిత్ర గీతాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రణతీ, హరీషా వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు.

సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కంటి ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాలు జరిగాయి. చికాగో చాప్టర్ ట్రస్టీలు పవన్ నారం రెడ్డి, గౌరి అద్దంకి సాధారణ కంటి పరీక్షలు, అధునాతన శస్త్రచికిత్సలు, నివారణ కంటి సంరక్షణ ప్రాముఖ్యతను వివరించారు. శంకర నేత్రాలయ USA నాయకత్వ బృందం నుండి బాలా ఇందుర్తి, మూర్తి రాకేపల్లి మరియు బ్రాండ్ అంబాసిడర్ ప్రసాద్ రెడ్డి కటంరెడ్డి భారతదేశంలో శంకర నేత్రాలయ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పరిచయం చేశారు. అధ్యక్షుడు బాల రెడ్డి ఇందుర్తి, కోశాధికారి మూర్తి రేకపల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం నుండి లిమా మ్యాతీవ్, మిల్వాకి చాప్టర్ ప్రతినిధులు చంద్ర మౌళి, జగదీశ్, అరోరా నగర కౌన్సిల్ సభ్యురాలు శ్వేతా బైద్ తదితర స్థానిక ప్రతినిధులు హాజరయ్యారు. చికాగో ట్రస్టీల నాయకత్వంలో వైస్ ప్రెసిడెంట్ హిమతో పాటు శ్రీహరి జాస్తి, కిరణ్ మాట్టే, మోహన్ పరుచూరి, రాధికా గరిమెళ్ళ, తమిశ్రా కొంచాడ, రామ్ ప్రసాద్, మాలతీ దామరాజు, శ్వేతా కొత్తపల్లి, బిందు, రాధా వీరపనేని, శైలజ సప్ప, శివ, రామకృష్ణ తాడేపల్లి, నరేశ్ తదితర బృంద సభ్యులు కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్నారు.

దాతల సహకారంతో చికాగో చాప్టర్ తరఫున 3 మొబైల్ సర్జికల్ యూనిట్లకు స్పాన్సర్ చేశారు. దీని ద్వారా మూడు గ్రామాల ప్రజలు లబ్ధి పొందుతారు. అడాప్ట్ ఎ విలేజ్ కార్యక్రమంలో భాగంగా రవి వీరపనేని, శివ గాడెపల్లి, పద్మ రావ్, సునితను సత్కరించారు. నివారించగల శంకర నేత్రాలయ వివరాలకు www.sankaranethralaya.org సందర్శించవచ్చు.

Tags-Shankara Netralaya Meeting On Eye Health In Chicago

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles