డా. తెన్నేటి సుధాదేవికి ఘన నివాళి

Featured Image

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ ఇంటర్నేషనల్, సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాలంలో శనివారం సాయంత్రం ప్రఖ్యాత కథా నవలా రచయిత్రి, తెలుగు అకాడమీ పూర్వ ఉపసంచాలకులు డా. తెన్నేటి సుధాదేవి సంస్మరణ సభ నిర్వహించారు. వంశీ సంస్థల వ్యవస్థాపకుడు డా. వంశీ రామరాజు భార్య సుధాదేవి నవంబర్ 23న మరణించారు. భారతదేశంతో పాటు పలు దేశాల ప్రతినిధులు ఆమెకి నివాళులు అర్పించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో పలువురు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పద్మభూషణ్ డా.యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్, డా. మేడసాని మోహన్, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, సినీ రచయిత భువనచంద్ర, సంగీత విద్వాంసులు గరికపాటి ప్రభాకర్, గాయకులు గజల్ శ్రీనివాస్, గాయని సురేఖ మూర్తి, హాస్యబ్రహ్మ శంకరనారాయణ, సినీ నటులు సుబ్బరాయశర్మ, సాహితీవేత్త ఓలేటి పార్వతీశం, రచయిత్రి జలంధర చంద్రమోహన్, రాజకీయవేత్త వామరాజు సత్యమూర్తి, అవధాని పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, జుర్రు చెన్నయ్య, పొత్తూరి సుబ్బారావు, ప్రవాసులు శ్రీ పేరి, సుచిత్ర, బూరుగుపల్లి వ్యాసకృష్ణ, సత్య మల్లుల, పద్మ మల్లెల, జయ పీసపాటి, స్వాతి జంగా, విక్రమ్ సుఖవాసి, వెంకప్ప భాగవతుల, సీతాపతి అరికరేవుల, తాతాజీ, పద్మజ ఉసిరికల, శ్రీసుధ, మాధవీలలిత, సాహిత్య జ్యోత్స్న, కోనేరు ఉమామహేశ్వరరావు, శారదా పూర్ణ శొంఠి, శారద ఆకునూరి, రాధిక నోరి, రాధ కాసినాథుని, కె ధర్మారావు, గుణ కొమ్మారెడ్డి, డా. సత్యమూర్తి, డా. సుజాత కోటంరాజు, డా. బి కె మోహన్ తదితరులు పాల్గొన్నారు. వంశీ సంస్థలతో పాటు సుధతో తమకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు.

Tags-Worldwide Telugus Pay Homage To Dr Tenneti Sudhadevi

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles