నాట్స్ మేరిల్యాండ్‌ విభాగం ప్రారంభం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) మేరీల్యాండ్‌ రాష్ట్ర విభాగాన్ని ప్రారంభించింది. ఈ చాప్టర్ సమన్వయకర్తగా వకుల్ మోరే, సంయుక్త సమన్వయకర్తగా విశ్వ మార్ని, మహిళా సాధికారత సమన్వయకర్తగా హరిణి నార్ల, సాంస్కృతిక కార్యక్రమాల సమన్వయకర్తగా సువర్ణ కొంగల్లలు వ్యవహరిస్తారు. మేరీల్యాండ్ చాప్టర్ ప్రారంభోత్సవంలో ఉగాది వేడుకులను నిర్వహించారు. తెలుగు సాంస్కృతిక ప్రదర్శనలు, జానపద నృత్యాలు, కూచిపూడి నృత్యాలు అలరించాయి. మేరీల్యాండ్‌ అభివృద్ధిలో తెలుగు వారు కృషి కూడా ఉందని సైక్స్‌విల్లే మేయర్ స్టేసీ లింక్ అన్నారు. సమాజాన్ని కలిపి ఉంచడంలో సంఘాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని సైక్స్‌విల్లే డౌన్‌టౌన్ కనెక్షన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ డీఈఐ ఆఫీసర్ జూలీ డెల్లా-మరియా అన్నారు. నాట్స్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి నూతన చాప్టర్ సభ్యులను సభకు పరిచయం చేశారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని తన వీడియో సందేశం పంపారు. భవిష్యత్తులో మేరీల్యాండ్ నాట్స్ విభాగం చేపట్టే ప్రతి కార్యక్రమానికి జాతీయ నాయకత్వం మద్దతు ఉంటుందని ప్రెసిడెంట్ (ఎలెక్ట్) శ్రీహరి మందాడి అన్నారు.

డాక్టర్ రామకృష్ణ భాగవతుల, బోర్డ్ డైరెక్టర్ వెంకట్ శాఖమూరి(ఫిల్లీ), ఉపాధ్యక్షులు హరి బుంగటావుల, శ్రీనివాస్ భీమినేని (న్యూజెర్సీ), ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి (మీడియా) మురళీ కృష్ణ మేడిచెర్ల (న్యూజెర్సీ), మార్కెటింగ్ జాతీయ సమన్వయకర్త కిరణ్ మందాడి, మిడ్ ఈస్ట్ జోనల్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్ రావు దగ్గుబాటి (నార్త్ కరోలినా), చాప్టర్ కో ఆర్డినేటర్లు వీరా తక్కెలపాటి (చికాగో), ఉమా నార్ని (నార్త్ కరోలినా), సికందర్ కోనపాక, సాగర్ రాపర్ల, రమేష్ నెల్లూరి, రమణ రకోతు తదితరులు పాల్గొన్నారు.

Tags-NATS Launches Maryland Chapter

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles