నాట్స్ పిట్స్‌బర్గ్ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు

Featured Image

నాట్స్ పిట్స్‌బర్గ్‌ విభాగం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీత గీతాలు, నాటక ప్రదర్శనలు అలరించాయి. సంస్కృతి డాన్స్ స్కూల్ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఉగాది వేడుకల్లో భాగంగా తెలుగు శ్లోక, తెలుగు వచనం, గణితం, చిత్రలేఖనం, లెగో డిజైన్, చెస్ పోటీలు పిల్లల కోసం నిర్వహించి బహుమతులు అందజేశారు. నాట్స్ పిట్స్‌బర్గ్ చాప్టర్ కోఆర్డినేటర్ రవి కొండపి, వెబ్ సెక్రటరీ రవికిరణ్ తుమ్మల సమన్వయపరిచారు. వ్యాఖ్యాతలుగా శిల్పా శెట్టి, అర్చనా కొండపి, మోనికాలు వ్యవహరించారు. నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, అధ్యక్షుడు మదన్ పాములపాటిలు పిట్స్‌బర్గ్ విభాగానికి అభినందనలు తెలిపారు.

Tags-NATS PittsBurgh 2025 Ugadi

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles