గేదెల దాముకు ఎడిసన్ నగర సేవా పురస్కారం

Featured Image

శ్రీకాకుళం జిల్లా కత్తులకవిటికి చెందిన న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్ నగర ప్రవాసాంధ్రుడు దాము గేదెలను ఆ నగర మేయర్ శాం జోషి సేవా పురస్కారంతో సత్కరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనా పత్రాన్ని అందజేశారు. 40ఏళ్లుగా అమెరికాలో పలు సేవా కార్యక్రమాలకు చేయూతనందించినందుకు గానూ దాముకు ఈ గుర్తింపును అందజేస్తున్నట్లు మేయర్ ప్రకటిచారు.

దామూ...శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్ నిర్మించారు. శ్రీ సాయి దత్త పీఠంలో డైరెక్టర్ గా తన సేవలు అందిస్తున్నారు. శ్రీరామనవమి నాడు సాయిదత్తపీఠంలో నిర్వహించిన వేడుకలో దాము గేదెల దంపతులను స్థానిక ప్రవాసులు అభినందించారు. తెలుగు కళా సమితి (TFAS) అధ్యక్షులు మధు అన్న, శ్రీనివాస్ గనగోని, సాయి దత్త పీఠం అధ్యక్షులు రఘు శంకరమంచి, సుబ్బారావ్ చెన్నూరీ, ప్రసాద్ కునిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Tags-Damu Gedela Felicitated By Community Service Award By Edison Mayor

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles