APTS ఆధ్వర్యంలో కుప్పంలో కోటి రూపాయలతో తొలి కో-వర్కింగ్ స్పేస్ ఏర్పాటు

Featured Image

ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఆర్థిక సహకారంతో కుప్పంలో కోటి రూపాయలతో రాష్ట్రంలో తొలిసారిగా కో-వర్కింగ్ స్పేస్, డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఈ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, APTS ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణతో కలిసి ప్రారంభించారు.

KADA సహకారంతో ఇంతటి భారీ స్థాయిలో గ్రామీణ విద్యార్థులకు లబ్ధి చేకూర్చే ఇలాంటి భవనాన్ని రూపొందించిన APTS సంస్థను, మోహనకృష్ణను సీఎం అభినందించారు. స్వర్ణ నవదిశ సెంటర్‌లో కోటి రూపాయల వ్యయంతో రెండు అమతస్థుల్లో అన్ని రకాల టెక్నాలజీ వసతులతో రాష్ట్రంలోనే మొట్టమొదటి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ మరియు డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని మోహనకృష్ణ అన్నారు. ఈ సెంటర్ ద్వారా విద్యార్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారు, చిన్న వ్యాపారవేత్తలు, ఫ్రీలాన్సర్లు లబ్ధి పొందుతారని, గ్రామీణ ప్రాంతాల వారికి, పేద కుటుంబాల వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని, యువతకు, కొత్తగా స్టార్టప్‌లు పెట్టే వారికి తక్కువ ఖర్చుతో ఆఫీసు వాతావరణం కల్పించడం, డిజిటల్ చదువులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం అని ఆయన పేర్కొన్నారు.

Tags-APTS Helps Build Andhras First Co-Working Space And Digital Library In Kuppam,chandrababu kuppam digital library,andhra first co-working space,kuppam digital library,andhrapradesh technology services

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles