మన అభిమానాన్ని ఓట్లుగా మార్చుకోవాలి...డల్లాస్‌లో జగన్ జన్మదిన వేడుకలు

Featured Image

పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వాన్ని నిర్వహించిన ఘనత వై.ఎస్.రాజశేఖరరెడ్డికి ఆయన తర్వత ఆయన తనయుడు, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డికి దక్కుతుందని...తిరిగి వైకాపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎన్నారై వైకాపా కార్యకర్తల అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని డల్లాస్ వైకాపా పిలుపునిచ్చింది.

శనివారం నాడు ఫ్రిస్కోలో డల్లాస్ ఎన్నారై వైకాపా ఆధ్వర్యంలో జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు ప్రసంగించారు. రెండేళ్లు కరోనా కారణంగా నష్టపోయినప్పటికీ కేవలం మూడేళ్లలో రాష్ట్రానికి కొత్త వైద్య కళాశాలు తీసుకురావడం, రైతుభరోసా, నవరత్నాలు, పింఛన్లు, విద్యావ్యవస్థలో మార్పులు, సచివాలయాలు వంటివి ఏర్పాటు చేసి ప్రజా పక్షపాత ప్రభుత్వాన్ని నడిపిన ఘనత వైకాపాదని వక్తలు అన్నారు. 2025లో స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి అత్యంత శక్తివంతుడని, వైకాపా హయాంలో జరిగిన అభివృద్ధిని సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేసి జగన్ పట్ల ఉన్న అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చాలని ప్రవాసాంధ్రులు పిలుపునిచ్చారు.

ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణ రాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తనకు రెండోసారి ఎమ్మెల్సీ పదవి రావడం వెనుక జగన్ ప్రత్యేక చొరవ ఉందని, నమ్మినవారిని వై.ఎస్ కుటుంబం ఆదరిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వైఫల్యాన్ని వివరించారు. అధికారపక్షం తనతో పాటు వైకాపా సభ్యులను మభ్యపెట్టినప్పటికీ తాను వైకాపాకు విధేయుడిగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. బ్రెయిన్ స్ట్రోక్ వలన అమెరికాలో చికిత్స పొందుతున్న తెలుగు విద్యార్థి, వైకాపా అభిమాని కృష్ణ ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం జగన్ జన్మదినం సందర్భంగా వెయ్యి డాలర్ల సాయాన్ని సూర్యనారాయణరాజు ప్రకటించారు. అనంతరం వైకాపా శ్రేణులు కేక్ కోసి వేడుక చేశారు. కార్యక్రమంలో డా. కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, అన్నపురెడ్డి శివ, కృష్ణారెడ్డి కోడూరు, తిరుమల్‌రెడ్డి, హర్షా రెడ్డి, ఉదయ్, డా. పవన్ పాముదుర్తి, వెంకటరెడ్డి, శ్రీకాంత్, తరుణ్, చందు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags-YS Jagan Birthday Celebrations In Dallas By NRI YSRCP

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles