తానా మాజీ అధ్యక్షుడు నాదెళ్ల గంగాధర్‌కు సతీవియోగం

Featured Image

ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మాజీ అధ్యక్షుడు, గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన డెట్రాయిట్ ప్రవాసాంధ్రుడు నాదెళ్ల గంగాధర్ సతీమణి దుర్గ నేడు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. అనారోగ్య కారణాలతో బాధపడుతున్న దుర్గకు గత కొంతకాలంగా హైదరాబాద్‌లోనే చికిత్స అందిస్తున్నారు.

గంగాధర్‌కు ఇద్దరు కుమార్తెలు. దుర్గ మృతి పట్ల తానా కార్యవర్గ సభ్యులు, ప్రతినిధులు, అమెరికావ్యాప్తంగా పలు తెలుగు సంఘాల ప్రతినిధులు ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. 2025 జులైలో నిర్వహిస్తున్న 24వ తానా మహాసభలకు గంగాధర్ ఛైర్మన్‌గా ఉన్నారు. మహాసభలను విజయవంతం చేసే ఏర్పాట్లలో చురుగ్గా ఉన్న గంగాధర్ కుటుంబంలో ఈ విషాదం పట్ల ప్రవాసాంధ్రులు తమ సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు.

Tags-TANA Ex President Gangadhar Nadella Wife Durga Passes Away

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles