Texas- డెంటన్‌లో గుంటూరు యువతికి రోడ్డు ప్రమాదం. పరిస్థితి విషమం.

Featured Image

ఉన్నత చదువులకోసం అమెరికాకు వెళ్లిన తెలుగు విద్యార్థిని ప్రాణలతో పోరాడుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లోని డెంటన్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని దీప్తి వంగవోలుగా గుర్తించారు. మరో విద్యార్థినికి కూడా తీవ్రంగా గాయపడిందని అయితే ఆమెకు ప్రాణాపాయం లేదని అమెరికా మీడియా నివేదికలు తెలిపాయి.ఈ ప్రమాదం శనివారం (ఏప్రిల్ 12) తెల్లవారుజామున, ఎన్. బోనీ బ్రే స్ట్రీ మరియు డబ్ల్యు. యూనివర్శిటీ డ్రైవ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన దీప్తి వంగవోలు ,ఆమె స్నేహితురాలు కాలినడకన ఇంటికి చేరుకోబోతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే ఆ వాహనం డ్రైవర్‌ని అక్కడినుంచి పారిపోయాడు. దీప్తికి తలకు లోతైన గాయం అయిందని, ఆమెకు శస్త్రచికిత్స జరుగుతోందని స్థానిక మీడియా తెలిపింది. ప్రస్తుతం డెంటన్ పోలీసులు ఈ హిట్ అండ్ రన్ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న డ్రైవర్‌ను, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు ప్రజల సహాయం కోరుతూ ప్రకటన కూడా విడుదల చేశారు. ఈ ఘటనపై మరిన్నివివరాలు అందాల్సి ఉంది.

లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, దీప్తి వంగవోలు నార్త్ టెక్సాస్ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ అండ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో మాస్టర్స్ చదువుతోంది. 2023లో నరసరావు పేట ఇంజనీరింగ్ కళాశాల నుండి బీటెక్ పూర్తి చేసింది.

Tags-Guntur Girl Deepti Hit and Run In Denton Texas

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles