వైభవంగా 'టాంటెక్స్' ఉగాది సంబరం

Featured Image

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) 2025 ఉగాది వేడుకలు శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. చిన్నారుల జాతీయ గీతాలాపన అనంతరం ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని సందడి చేశారు. టాంటెక్స్ పాలకమండలి అధ్యక్షుడు దయాకర్ మాడా, సాంస్కృతిక కార్యక్రమాల అధ్యక్షురాలు శాంతి నూతిలు ఉగాది శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. టాంటెక్స్ అధ్యక్షుడు చంద్రశేఖర్ పొట్టిపాటి సభికులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సంస్థ లక్ష్యాలను వివరించారు.

మ్యూ ఫిన్ మ్యూజిక్ అకాడమీ సినీగేయాలు, ప్రణయ్ పొట్టిపాటి బృందం సంగీత విభావరి, ఆదిత్య 369 చలనచిత్రం ఆధారంగా మనబడి విద్యార్థులు రూపొందించిన 'కాలయంత్రంలో విజయ వైభవం' హాస్యరూపకం, మన్వితారెడ్డి బృందం 'రామాయణం కథ', శ్రీలత సూరి బృందం 'సువ్వి..సువ్వి' జానపద నృత్యం అలరించాయి. రాగమయూరి విద్యార్థుల భరతనాట్యం, కళ్యాణి ఆవుల శిష్యుల కూచిపూడై ప్రదర్శన ఆకట్టుకుంది. పంచాంగ శ్రవణము ఏర్పాటు చేశారు. గాయనీ గాయకులు కాంత్ లంకా, అంజనా సౌమ్యల సంగీత విభావరి మైమరపించింది. సమన్వితా మాడను బెస్ట్ వాలంటీర్ పురస్కారాన్ని అందజేశారు. శ్రీదేవి యడ్లపాటి, ప్రేమ్ గంగలకుంటను సన్మానించారు. వాసవి-స్వాతిలు వ్యాఖ్యాతలుగా రక్తికట్టించారు. స్థానిక తెలుగు క్యాలేండరును ఆవిష్కరించారు.

సాయి బూర్లగడ్డ, లెనిన్ వేముల, వీరా లెనిన్ తుళ్లూరి, తదుపరి అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి, ఉపాధ్యక్షులు ఉదయ్ నిడిగంటి, కార్యదర్శి దీప్తి సూర్యదేవర, ట్రెజరర్ అనిల్ సూరపరాజు, సంయుక్త కార్యదర్శి దీపికారెడ్డి, జాయింట్ ట్రెజరర్ లక్ష్మీనరసింహ పోపూరి, మాజీ ఉపాధ్యక్షుడు సతీష్ బండారు, మాజీ అధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్.యు.నరసింహారెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చిన్నసత్యం వీర్నాపు, మూర్తి ములుకుట్ల, డాక్టర్.పుదూరు జగదీశ్వరన్, నవీన్ గొడవర్తి, రాజా, నాటా,తానా,నాట్స్,TPAD సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags-2025 TANTEX Ugadi In Dallas, #TANTEX #DallasTelugu #Ugadi2025 #TNILIVE

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles