FNCA మలేషియా ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం

Featured Image

ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ మలేషియా (FNCA -మలేషియా) ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు 2025 మలేషియాలోని కౌలాలంపూర్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ ఆనంద్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరామ్, మలేషియా తెలుగు ఫౌండేషన్ అధ్యక్షుడు దాతో కాంతారావు , తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య సుధాకరన్ , మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దాతో డాక్టర్ ప్రకాష్ రావు ,తెలుగు ఇంటలెక్చువల్ సొసైటీ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ కొణతాల ప్రకాష్ రావు , పెళ్లి చూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా ప్రెసిడెంట్ శివ ప్రకాష్ , బి ర్ స్ మలేషియా ప్రెసిడెంట్ మారుతి, మలేషియా తెలంగాణ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సందీప్ గౌడ్, ఫెడరేషన్ అఫ్ ఎన్ ఆర్ ఐ కల్చరల్ అసోసియేషన్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ డాక్టర్ MJR వరప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహించిన వారికి, కోవిడ్ లాక్ డౌన్ సమయంలో మలేషియాలో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆశ్రయం కల్పించి వారి స్వదేశానికి పంపించే వరకు అన్ని రకాల సదుపాయాలు అందించిన వారికి, తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడానికి కృషి చేసిన వారికి ఈ ఏడాది ఉగాది కీర్తిరత్న పురస్కారాలతో సత్కరిస్తున్నట్లు FNCA-మలేషియా ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు.

పురస్కార గ్రహీతలు-

తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి ప్రొఫెసర్ డాక్టర్ నాగరాజు సూర్యదేవర ,షైక్ సుభాని సాహెబ్, మలేషియా ఆంధ్ర అసోసియేషన్ నుండి విజయ శారద గరిమెళ్ళ, వెంకట్ చిక్కం, మలేషియా తెలుగు ఫౌండేషన్ నుంచి ప్రకాష్ రావు, జగదీశ్వర్ రావు, మలేషియా తెలుగు వెల్ఫేర్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నుండి కృష్ణమూర్తి, సుబ్బారావు, తెలుగు ఇంటలెక్చవల్ సొసైటీ అఫ్ మలేషియా నుంచి శ్రీరాములు సన్నాసి, తొండ కృష్ణమూర్తి చంద్రయ్య, పెళ్లిచూపులు అసోసియేషన్ ఆఫ్ మలేషియా నుంచి పారు ఆపతినారాయణన్, గువేంద్ర శ్రీనివాసరావు.

FNCA-మలేషియా 2025-2026కి నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది-

అధ్యక్షుడు - బూరెడ్డి మోహన్ రెడ్డి

సహాధ్యక్షుడు- కృష్ణ ముత్తినేని

ఉపాధ్యక్షుడు- రవివర్మ కనుమూరి

ప్రధాన కార్యదర్శి - శివ సానిక

సంయుక్త కార్యదర్శి - భాస్కర్ రావు ఉప్పుగంటి

కోశాధికారి - రాజ శేఖర్ రావు గునుగంటి

యువజన విభాగ అధ్యక్షుడు- క్రాంతి కుమార్ గాజుల

సాంస్కృతిక విభాగ అధ్యక్షులు - సాయి కృష్ణ జులూరి

కార్యనిర్వాహక సభ్యులు - నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణింద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, రవితేజ శ్రీదాస్యాం

అధ్యక్షురాలు - శిరీష ఉప్పుగంటి

ఉపాధ్యక్షురాలు - దుర్గా ప్రవళిక రాణి కనుమూరి

కార్యనిర్వాహక సభ్యులు - సూర్య కుమారి, రజని.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-FNCA Malaysia 2025 Ugadi Awards

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles