వాషింగ్టన్ డిసిలో ఉల్లాసంగా ఆటా వేసవి పిక్నిక్

Featured Image

వాషింగ్టన్ డి.సి మెట్రో ప్రాంతంలోని తెలుగు కుటుంబాల కోసం అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఆదివారం నాడు మెరిలాండ్‌లోని డమాస్కస్ రిక్రియేషనల్ పార్క్‌లో వేసవి పిక్నిక్ ఉల్లాసంగా సాగింది. ప్రవాస పెద్దలు, పిల్లలు, ఇండియా నుండి వచ్చిన ప్రవాసులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. రుచికరమైన భోజనాలు, పలు రకాల ఆటలు, వినోద కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

బింగో, లెమన్ స్పూన్, ఫ్రిస్బీ, తగ్ ఆఫ్ వార్, వాలీబాల్, త్రోబాల్, ఖోఖో, మెహందీ డిజైన్లు, మేజీషియన్ ప్రదర్శనలు, సంగీతం, డ్యాన్స్‌, రాఫిల్ డ్రా వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ ద్వారా అందిన ఆహారాన్ని మానా ఫుడ్ సెంటర్‌కు అందించారు.

ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమంలో పార్థ బైరెడ్డి, కృష్ణా రెడ్డి, జీనత్ రెడ్డి, శ్రిధర్ భాణాల, విష్ణు మాధవరం తదితరులు సమన్వయపరిచారు. 2026 జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఆటా సభలకు ప్రవాసులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Tags-America Telugu Assoc ATA Summer Picnic In Washington DC

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles