ఫిలడెల్ఫియాలో వై.ఎస్.ఆర్. వర్ధంతి

Featured Image

వైఎస్‌ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్బంగా అమెరికాలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ వర్థంతిని పురస్కరించుకుని ఫిలడెల్ఫియా నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్ సంస్థ సహాయంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. డాక్టర్ ఘవరెడ్డి గోసల సమన్వయకర్తగా ప్రతి సంవత్సరం జరిగే ఈ కార్యక్రమంలో ఆళ్ళ రామిరెడ్డితో పాటు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ప్రతినిధులు, వైఎస్సార్ అభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. 100 మందికి పైగా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. గత 15సంవత్సరాలుగా రాజన్నను స్మరించుకుంటూ ఏర్పాటు చేస్తున్న ఈ శిబిరంలో పలువురు వైఎస్సార్ అభిమానులు రక్త దానం చేసి ప్రాణదాతలుగా నిలిచారు. 9/11 ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుంటూ సంతాపం తెలియజేశారు.

Tags-YSR Foundation USA Conducts Blood Donation Camp In Philadelphia

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles